KCR : ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం ఎప్పుడో తెలుసా? అక్కడ చేయబోతున్నాడా?

మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. స్పీకర్ సమక్షంలో ప్రమాణం చేయనున్నారు.

Telugu Mirror : మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. స్పీకర్ సమక్షంలో ప్రమాణం చేయనున్నారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. తర్వాత తన ఫాంహౌస్‌లో బాత్రూంలో కాలు జారి పడటంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై తొంటి ఆపరేషన్ చేశారు.

అప్పటి నుంచి ఇంటికే పరిమితం అయిన కేసీఆర్.. తాజాగా కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసినప్పటికీ బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

did-you-ever-know-kcrs-oath-as-an-mla-are-you-going-to-do-it-there
Image Credit : Mint

Also Read : Petrol, Diesel Prices On January 27: ముంబై, ఢిల్లీ, చెన్నై మరియు ఇతర నగరాల్లో స్థిరంగా ఉన్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు

ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలామంది గత డిసెంబర్ నెలలోనే ప్రమాణం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులచే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ అయ్యాకే ప్రమాణం చేశారు. తాజాగా ఎమ్మెల్యే గా స్పీకర్ సమక్షంలో కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.

అయితే ప్రమాణ స్వీకారం తరువాత ప్రతిపక్ష నాయకుడిగా కెసిఆర్ వ్యవహరించనున్నారు. తాను ఎప్పుడూ ద్వేషించే రేవంత్ రెడ్డి సీఎం అయిన నేపథ్యంలో కెసిఆర్ ఎలాంటి రాజకీయాలు చేయబోతున్నాడు అనే దానిపై ఆసక్తి నెలకొన్నది. ఇదే సమయంలో కెసిఆర్ ను కాంగ్రెస్ నాయకులు ఎలా నిలువరిస్తారో అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతున్నది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రావడంతో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments are closed.