Good News For Metro Passengers: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త, అది ఏంటంటే?

మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త అందించింది. మెట్రో సర్వీసులు ఎక్కువ సమయం పాటు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.

Good News For Metro Passengers: హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు చాలా కీలకం అయ్యాయి. హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) కు నగరవాసుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి దాన్ని వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా వేసవి నెలల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది సూర్యుని వేడికి కూడా తట్టుకోలేక మెట్రోను ఎంచుకుంటారు. వెళ్లినంత సేపు ఏసీ (AC) లో కూల్ గా ఉండొచ్చు అని మెట్రో లో ప్రయాణానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. రద్దీ పెరగడంతో హైదరాబాద్ మెట్రో మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు 50 కోట్ల మంది ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చి హైదరాబాద్ మెట్రో చరిత్ర సృష్టించింది. దేశంలోనే మూడో పొడవైన మెట్రో వ్యవస్థగా హైదరాబాద్‌ మెట్రో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

అయితే, మెట్రో రైలు ప్రయాణికుల (Railway Passengers) కు శుభవార్త అందించింది. హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి, హైదరాబాద్ మెట్రో తాజాగా మెట్రో ట్రైన్స్ లో ప్రయాణించే వారికి అద్భుతమైన వార్తను అందించింది. మరి ఇంతకీ హైదరాబాద్ మెట్రో చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి? ఎలా ప్రయోజనం చేకూరుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం.

హైదరాబాద్ మెట్రో సర్వీసులు ఎక్కువ సమయం పాటు అందుబాటులో ఉంటాయి. మే 17న, మెట్రో సేవలు అదనపు గంటల్లో కూడా అందుబాటులో ఉంటాయి. రాత్రి 11.45 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రకటించింది.

Also Read: Foot Board Journey in Train: రైలులో ఫూట్ బోర్డు ప్రయాణం చేస్తున్నారా? ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే
టెర్మినల్ స్టేషన్ల (Terminal Stations) నుండి చివరి రైలు 11.45 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ సేవలు మే 17న మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మెట్రో ప్రయాణికులు ఇప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ఈ వర్షాల వల్ల టూ వీలర్ ప్రయాణం (Two Wheller Journey) కంటే మెట్రో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వర్షంలో తడవకుండా హాయిగా ప్రయాణం చేయవచ్చు. ఇంకా, ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండవు.దాంతో, రాత్రి షిఫ్ట్‌లో పనిచేసే కూడా వారు ఈ అవకాశం నుండి మంచి ప్రయోజనం పొందుతారు.

హైదరాబాద్ మెట్రో మరో విషయాన్ని కూడా వెల్లడించింది. ప్రయాణీకులు తమ లగేజీని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. మెట్రో రైలు ఎక్కేటప్పుడు, బ్యాగ్‌ను వెనుకకు కాకుండా ముందు వైపుకు తీసుకెళ్లాలని చెప్పింది. దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చు.

ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో మీరు లగేజీ (Luggage) ని వెనుక భాగంలో ఉంచితే, ఆ లగేజ్ లో ఏదైనా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితులను నివారించడానికి, బ్యాగ్‌ను ముందు పెట్టండి. మీ లగేజ్ పట్ల మీరే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Good News For Metro Passengers:

Comments are closed.