Gruha Lakshmi Scheme: మీ ఇంటి నిర్మాణం ఇంకా కలగానే మిగిలిందా? గృహలక్ష్మి పథకం తో నెరవేర్చుకోండి మరి!

Telugu Mirror: సొంత స్థలం ఉన్న కూడా ఇల్లు కట్టుకునే స్థోమత లేక ఇబ్బంది పడుతున్న తెలంగాణ బిడ్డలకు BRS ప్రభుత్వం తీపి కబురును అందించింది . ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యం లో కీలక హామీలపై దృష్టి పెట్టింది BRS ప్రభుత్వం. గత ఏడాదే ఈ అంశం పై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటన చేశారు.ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన నిబంధనలపై అందరి చూపు పడింది. నిజానికి ఈ స్కీమ్ కంటే ముందు డబుల్ బెడ్ రూమ్ స్కీం(double bed room scheme) ని తీసుకొచ్చింది సర్కార్ ప్రభుత్వం.ఈ ఇళ్ల పై చాలా మంది చాల ఆశలు పెట్టుకున్నప్పటికీ అనుకున్నంత మేరకు లక్ష్యం నెరవేరలేదు. ఫలితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల విషయంలో ప్రభుత్వ అంచనాలు తప్పినట్లు గా అయింది.

సొంత జాగ ఉండి ఇల్లు కట్టుకునే వాళ్లకు ‘గృహలక్ష్మి'(Gruha Lakshmi)పథకం కింద రూ. 3 లక్షలు ప్రభుత్వం అందచేస్తుంది .ఇళ్లను ఆ ఇంట్లోని గృహిణి పేరిటే మంజూరు చేస్తారు.అయితే ‘గృహలక్ష్మి’ పథకం లో దివ్యంగులకు 5 శాతం రిజర్వేషన్ ని ప్రభుత్వం ప్రకటించింది.ప్రతి నియోజక వర్గం చొప్పున 3000 వేల మంది దివ్యంగులు ఉండగా మొత్తం తెలంగాణ రాష్ట్రము(telangana state)లో 4 లక్షల మంది ఈ అవకాశాన్ని పొందుతున్నారు.ఈ నిర్మాణానికి మొత్తం 7,350 కోట్లు ఖర్చు చేయనుంది BRS ప్రభుత్వం.

Also Read:chedodu Scheme–జగనన్న అందించే చెడోడు పథకం ..ఆన్‌లైన్ తనికీకై ఇలా చేయండి

gruhalaxmi scheme from telangana scheme
image credit: TMC assam

ఇటీవల రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే. వాసుదేవరెడ్డి(K. Vasudeva reddy) సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేయగా సీఎం కేసీఆర్‌(cm k.c.r) సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కు దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అడిగిన వెంటనే సానుకూలంగా స్పందింనందుకు ఆయనకు దివ్యాంగుల సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది అన్నారు. రాష్ట్రంలో దివ్యాంగులు సంతోషంగా ఉన్నారని, సొంతింటి కల నెరవేరి దివ్యాంగుల్లో ఆత్మగౌరవం, విశ్వాసం పెరిగింది అన్నారు.

Also Read:Digi Locker: ఈరోజు నుంచి పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు ఇలా చేయండి. కొత్తగా డిజిలాకర్ సేవలు

ఇకపోతే ఇందులో మొత్తంగా చూసుకుంటే SC లకు 20 శాతం , ST లకు 10 శాతం , BC మరియు మైనారిటీలకు 50 శాతం ప్రభుత్వం అందిస్తుంది. గృహలక్ష్మి పథకం కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్(web portal)తో పాటు, మొబైల్ యాప్ కూడా సిద్ధం చేయనుంది . అయితే ప్రభుత్వం 3 లక్షలను మూడు విడతల్లో అందచేస్తుంది .ఇంటి బేస్‌మెంట్‌ స్థాయిలో రూ.లక్ష, పైకప్పు దశలో రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష చెల్లిస్తారు.తొలుతగా లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వనుంది .

Leave A Reply

Your email address will not be published.