salary increased for kerala anganwadi workers: కేరళ రాష్ట్రంలోని అంగన్‌వాడీ మరియు ఆశా వర్కర్లకు శుభవార్త, వేతనాలను రూ.500-1,000 వరకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

అంగన్‌వాడీ మరియు ఆశా వర్కర్ల వేతనాల పెంపుతో ఈ కేటగిరీల పరిధిలోకి వచ్చే మొత్తం 87,977 మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ తెలిపారు

Telugu Mirror : రాష్ట్రంలోని అంగన్‌వాడీ మరియు ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) వర్కర్లకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ మరియు ఆశా వర్కర్లకు దాదాపుగా రూ.1,000 వరకు జీతాలు పెరుగుతాయని కేరళ ప్రభుత్వం తెలిపింది. వేతనాల పెంపుతో ఈ కేటగిరీల పరిధిలోకి వచ్చే మొత్తం 87,977 మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ (Minister K N Bala Gopal) తెలిపారు.

Also Read : SBI YONO GLOBAL : త్వరలో సింగపూర్ మరియు అమెరికాలో “యోనో గ్లోబల్” యాప్‌ను ప్రారంభించనుంది.

అంగన్‌వాడీ మరియు ఆశా వర్కర్లకు జీతం పెరుగుదల 1000 రూపాయలకు వరకు ఉంటుందని తెలిపారు. అంగన్‌వాడీలో 10 సంవత్సరాలకు పైగా ఉన్న వర్కర్లు మరియు హెల్పర్‌లకు వారి ప్రస్తుత వేతనంతో పాటు రూ. 1,000 అదనంగా ఇవ్వబడుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ గ్రూపులోని ఇతరులకు రూ.500 పెంపు ఉంటుందని తెలిపారు. 62,852 మంది అంగన్‌వాడీ సిబ్బందిలో 32,989 మంది అంగన్‌వాడీ వర్కర్ల వేతనాలు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. పదేళ్లకు పైగా సర్వీసు ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌ల గౌరవ వేతనాలు ₹1000 పెరగనున్నాయి. పదేళ్లలోపు అనుభవం ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇది ₹500 వరకు పెరుగుతుంది.

Also Read: SSC CGL 2023: తుది ఖాళీల జాబితా విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

ఈ నిర్ణయం వల్ల రాష్టం లో ఉన్న 62,852 మందికి ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. గౌరవ వేతనాలు పెంచుతామని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ అధికారిక నిర్ణయం మాత్రం పెండింగ్‌లో ఉంది. అలాగే ఆశ వర్కర్ల వేతనాన్ని రూపాయలు 5000 వరకు పెంచాలని నిర్ణయించారు దీనివల్ల 26 125 మంది లాభపడ్డారు ఈ రెండు పెంపుదలలు డిసెంబర్ నుంచి అమలులోకి వస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు. COVID-19 మహమ్మారి పరిస్థితిలో అంగన్‌వాడీ మరియు ఆశా వర్కర్లు చాల ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆశాలు అందిస్తున్న సేవలకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతున్నదని, దేశంలోనే అంకితభావంతో పనిచేస్తున్న ఈ ఆరోగ్య కార్యకర్తలకు అత్యధిక వేతనాలు అందించడంలో ప్రభుత్వం ముందు ఉంటుందని అన్నారు.

గతంలో, ASHA లు వేతనాల పెంపు మరియు సకాలంలో వేతనాన్ని పొందాలని నిరసన మరియు ప్రదర్శనలు చేసారు. ఆశాలు, ఏఎన్‌ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను అమలు చేయడంపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులకు తెలిపారు. పెంచిన వేతనాలు డిసెంబర్‌ నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి కార్యాలయం తెలిపింది.

Comments are closed.