Indian Railways : మీకు తెలుసా? రైలు టిక్కెట్టుపై ఉండే 5 అంకెల అర్ధం ఏమిటో?

మీరు ఎప్పుడైనా రైలు టిక్కెట్‌పై ఐదవ అంకెను గమనించారా? దాని అర్ధం ఏంటో మీకు తెలుసా? వివరాలు తెలుసుకుందాం.

Indian Railways : చాలా మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. అంతే కాదు, అవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. తొందరగా గమ్యాన్ని చేరుకుంటారు. రైలు ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవం. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తున్నారు.

ప్రతిరోజు, లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే రైలులో ప్రయాణిస్తున్నారు. కానీ, భారతీయ రైల్వే వినియోగదారులకు అందించే కొన్ని ప్రధాన సేవల గురించి చాలా మందికి తెలియదు. దాదాపు ఎక్కువ ప్రయాణికులు రైలు ప్రయాణం చవకైనదని మరియు సులభంగా ఉంటుందని అనుకుంటారు.

అందుకే దూర ప్రయాణీకులు రైళ్లను ఎంచుకుంటున్నారు. పండుగల సమయంలో, రద్దీగా ఉండే రైల్వే లైన్లలో రద్దీని తగ్గించడానికి అదనపు రైళ్లు జారీ చేస్తున్నారు. మీరు రోజూ రైలు ప్రయాణం చేస్తున్నారా? రైలు ప్రయాణం చేస్తున్నప్పటికీ చాలా మందికి చాలా విషయాలు తెలియవు. మీరు ఎప్పుడైనా రైలు టిక్కెట్‌పై ఐదవ అంకెను గమనించారా?

రైలు టిక్కెట్‌పై ఉన్న ఐదు అంకెలు రైలు నంబర్,రైలు యొక్క స్థితిగతిని మరియు ఆ రైలు ఏ కేటగిరీకి చెందిందో సూచిస్తాయి. ఈ సంఖ్యలు 0 నుండి 9 వరకు ఉంటాయి.

Indian Railways

సంఖ్య 0తో ప్రారంభమైతే, అది స్పెషల్ కేటగిరీ రైలును సూచిస్తుంది. సంఖ్య 1తో ప్రారంభమైతే, రైలు రాజధాని, జన శతాబ్ది, జన్ సదర్, సంపర్క్రాంతి, గరీబ్రత్ మరియు దురంతో వంటి సుదూర ప్రాంతాలకు వెళుతుందని అర్థం.

సంఖ్య 2తో ప్రారంభమైతే, రైలు చాలా దూరం వెళ్తుందని అర్థం. సంఖ్య 3తో ప్రారంభమైతే, అది కోల్‌కతా సబర్బన్ రైలు అని అర్థం. నాలుగు అంకెలతో ప్రారంభమైతే, న్యూఢిల్లీ, చెన్నై, సికింద్రాబాద్ మరియు ఇతర మెట్రో నగరాల సబర్బన్ రైళ్లు ఈ గ్రూప్‌లోకి వస్తాయి.

సంఖ్య 5తో ప్రారంభమైతే, అది ప్యాసింజర్ రైలు అని అర్ధం. సంఖ్య 6తో ప్రారంభమైతే, అది MEMU రైలు. 7తో ప్రారంభమైతే అది డెము రైలు అని అర్ధం. అదే సంఖ్య 8తో ప్రారంభమైతే, అది రిజర్వ్ చేసిన రైలు. సంఖ్య 9తో ప్రారంభమైతే, అది ముంబై సబర్బన్ రైలు అని అర్ధం. ఐదు అంకెలలో మొదటి అంకె రైలును సూచిస్తుంది, మిగిలిన నాలుగు అంకెలు రైల్వే డివిజన్ మరియు జోన్‌ను గుర్తిస్తాయి.

Indian Railways

Also Read : 50 Lakhs Subsidy: ఈ అర్హత ఉంటే చాలు. రూ.50 లక్షల సబ్సీడీ పొందవచ్చు..!

Comments are closed.