Kisan Credit Card : రైతులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. తక్కువ వడ్డీతో రూ.3 లక్షల వరకు లోన్.

రైతులు ఇబ్బంది పడకుండా ఉండకూడదు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ ను ప్రవేశపెట్టింది.

Kisan Credit Card : రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. రైతులు తమ పంటకు పెట్టుబడి పెట్టడం కోసం బ్యాంకుల వద్ద ఎన్నో రుణాలు తీసుకొని అప్పుల ఊబిలో పడుతున్నారు. రైతులు ఇలా ఇబ్బంది పడకుండా ఉండకూడదు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ ను (PM Kisan Credit Card Loan) ప్రవేశపెట్టింది. మరి, ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి? అనే విషయం గురించి తెలుసుకుందాం.

కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ :

అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆన్‌లైన్‌లో KCC రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వీటిలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. ప్రస్తుతం ఈ బ్యాంక్‌లో ఇంటి నుండి ఆన్‌లైన్‌లో కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాన్ని పొందవచ్చు. ఈ బ్యాంక్ డిజిటల్ KCC రుణాలను అందిస్తుంది.

కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

దీని కోసం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. డిజిటల్ KCC లోన్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. లేదంటే, ఈ లింక్‌పై క్లిక్  https://tinyurl.com/3yxppmen చేస్తే KCC డిజిటల్ లోన్ వెబ్‌సైట్‌ ఓపెన్ అవుతుంది.

డిజిటల్ కేసీసీ లోన్లు, అప్లై ఆన్లైన్ కేసీసీ STP అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. అయితే, ఇప్పుడు ఇక్కడ రెండవ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అప్పుడు కొత్త పేజీ లోడ్ అవుతుంది.

Kisan Credit Card

కొత్త పేజీ లోడ్ అయిన తర్వాత… ఇప్పుడు “APPLY NOW” క్లిక్ చేయండి. అప్పుడు సెల్ఫ్ సర్వీస్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. రుణానికి సంబంధించిన సమాచారం అక్కడ కనిపిస్తుంది. రుణ మొత్తం మరియు వడ్డీ రేటును ఒకసారి చెక్ చేయాలి. కస్టమర్‌గా బ్యాంక్ స్టేటస్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అవును లేదా కాదు అనే ఆప్షన్ ను సబ్మిట్ చేయండి.

మీకు ఖాతా నంబర్ ఉంటే, దానికి నమోదు చేయండి. ల్యాండ్ వెరిఫికేషన్ (Land Verification) ఉంటుంది. పండించే పంటను ఏంటో వెల్లడించాలి. అప్పుడు రుణం అందుతుంది. ఈ-సైన్ కూడా చేయాలి. ఆ తర్వాత డబ్బులు వస్తాయి. పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ది పొందే రైతులకు ఈ రుణాలు సులువుగా వస్తాయి. ఎస్‌బీఐ రూ. లక్షల వరకు రుణాలను అందిస్తుంది. ఈ పథకం అన్ని బ్యాంకుల వద్ద వడ్డీ రాయితీని అందిస్తుంది.

కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రాసెసింగ్ ఫీజు లేదు, ఫిజికల్ పేపర్లు లేకుండా రూ. 1.60 లక్షల వరకు రుణం పొందవచ్చు. మీరు అర్హులైతే, రూ. 1.60 లక్షలు నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి. ఇతర వ్యక్తిగత రుణాల కంటే వడ్డీ రేట్లు అత్యంత తక్కువగా ఉంటాయి. కేంద్రం దాదాపు 4% వడ్డీ రాయితీని అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు బ్యాంకు ఆధారంగా మారవచ్చు.

Kisan Credit Card

Comments are closed.