PAN and PRAN : మీకు తెలుసా? PAN మరియు PRAN కార్డ్ గురించి, తేడా తెలుసుకోండి

ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ PAN కార్డ్ కలిగి ఉండటం అవసరమైనదిగా ఉన్నది. అలాగే PRAN కూడా పెన్షన్ దారులకు అవసరమైన కార్డ్ గా మారింది. PAN మరియు PRAN మధ్య తేడాను తెలుసుకుందాం.

PAN మరియు PRAN రెండూ ఒకేలా ఉన్నప్పటికీ వాటి యొక్క ప్రయోజనాలు (Benefits) పూర్తిగా భిన్నమైనవి. ఆర్థిక లావాదేవీల నిర్వహణ కోసం వ్యక్తులకు రెండూ ముఖ్యమైనవి. PAN అనేది శాశ్వత ఖాతా సంఖ్య ఇది 10-అంకెల ప్రత్యేక సంఖ్య, అయితే PRAN అనేది మాత్రం శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య ఇది 12-అంకెలతో కూడిన ప్రత్యేక సంఖ్య.  భారతదేశంలో ఉన్న పన్ను చెల్లింపుదారులందరికీ పాన్ తప్పనిసరి

అన్ని పన్ను సంబంధిత ప్రయోజనాల కోసం ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన PAN కార్డ్ అవసరం. మరోవైపు, నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో పెట్టుబడి పెట్టే వారికి PRAN కార్డ్ ముఖ్యమైనది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం

PAN అంటే ఏమిటి?

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆదాయపు పన్ను శాఖ ద్వారా జారీ చేయబడిన, PAN లేదా శాశ్వత ఖాతా సంఖ్య (Permanent Account Number) ఒక ప్రత్యేకమైన 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. పన్ను చెల్లింపుదారులందరికీ కేటాయించిన నంబర్ సహాయంతో, ఆదాయ పన్ను శాఖ అన్ని పన్ను (tax) సంబంధిత లావాదేవీలు మరియు సమాచారాన్ని నిక్షిప్తం (deposit) చేయడానికి PAN ను వినియోగిస్తుంది. పన్ను చెల్లింపుదారులందరికీ ఇన్ కంటాక్స్ రిటర్న్ లు దాఖలు చేయడం, వాపసు యొక్క క్లెయిమ్ మరియు లోపాలు సరిచేసిన రిటర్న్‌లను ఫైలింగ్ చేయడం వంటి అనేక ఆదాయపు పన్నుకు సంభంధించిన యాక్టివిటీస్ ను నిర్వహించడానికి PAN తప్పనిసరి.

PRAN అంటే ఏమిటి?

శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (Permanent Retirement Account No) లేదా PRAN అనేది నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) ద్వారా మంజూరు (Sanction) చేయబడిన ప్రత్యేకమైన 12-అంకెల సంఖ్య. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద సబ్ స్క్రైబర్ లకు ఇది తప్పనిసరి. PRAN, NPS పెట్టుబడికి సంబంధించిన అన్ని లావాదేవీల (transactions) ను నడపడానికి మరియు పెన్షన్ దారుల ఉపయోగాలను నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది.

Also ReadNPS VS OPS : పెన్షన్ విధానంపై ఉద్యోగుల నిరసనలు ఎందుకు? పాత, కొత్త పెన్షన్ విధానాలపై తేడా తెలుసుకోండి

PAN మరియు PRAN మధ్య వ్యత్యాసం

PAN and PRAN : Do you know? About PAN and PRAN card, know the difference
Image Credit : The Begusarai

PRAN

ఒక వ్యక్తి టైర్-I మరియు టైర్-IIతో సహా PRAN కింద రెండు రకాల నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖాతాలను కలిగి ఉండవచ్చు.

ఇప్పటికే ఉన్న మరియు కొత్త NPS క్రిందకు వచ్చే సభ్యులు అందరికీ గుర్తింపుగా PRAN పనిచేస్తుంది. వారి పెన్షన్ నిధులను అనుసరించడంలో వారికి తోడ్పడుతుంది.

NPS పెట్టుబడిదారులందరికీ PRAN ఇవ్వబడుతుంది. ఇది ఒక ప్రత్యేక గుర్తింపు పత్రం గా పనిచేస్తుంది.

PRAN కోసం దరఖాస్తులను NSDL పోర్టల్‌లో PRAN దరఖాస్తును చేసుకోవచ్చు.

Also Readఈ పధకాలకు పాన్, ఆధార్ తప్పనిసరి. రేపే చివరి రోజు, ఇలాచేయకుంటే అక్టోబర్ 1 నుంచి ఖాతా ఆగిపోయే అవకాశం.!

PRAN కోసం దరఖాస్తు చేసుకోవడానికి చందాదారులకు సక్రమంగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్, ఫోటో మరియు KYC పత్రాలు అవసరం.

సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (CRA) ద్వారా PRAN రికార్డ్ లు నిర్వహించబడతాయి.

ఒక చందాదారుడికి ఒక PRAN ఖాతా మాత్రమే కలిగి ఉండాలి.

PAN

ఆదాయపు పన్నుకి సంభంధించిన అన్ని నిర్దిష్ట చెల్లింపులు (Certain payments) మరియు అనేక ఇతర ఆర్థిక వ్యవహారాలు అలాగే పెట్టుబడులకు ఉపయోగిస్తారు.

ఇది టాక్స్ చెల్లింపులను నిర్వహించడానికి కావలసిన ఆర్థిక పరమైన ట్రాన్జక్షన్ చేసేటువంటి వ్యక్తులు మరియు వ్యాపార సంస్థలకు ఉపయోగపడుతుంది.

ఇది ప్రామాణికమయ్యే KYC గా కూడా పనిచేస్తుంది.

NSDL పోర్టల్ లేదా ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో PAN కోసం దరఖాస్తు చేసుకోవాలి.

Also Readపాన్‌కార్డు పోగొట్టుకుంటే ఏం చేయాలి, ఇ పాన్‌కార్డ్ డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలి

పాన్ కోసం దరఖాస్తు చేయడానికి పన్ను చెల్లింపుదారులు PAN కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే అవసరమయ్యే పత్రాలు అడ్రస్ ప్రూఫ్, గుర్తింపు పత్రం (Identity document), ఫోటోతో పాటు బర్త్ సర్టిఫికెట్.

ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి పాన్ రికార్డుల నిర్వహణ వస్తుంది.

ప్రస్తుతం ఉన్న పన్ను చట్టాల ప్రకారం, ఒక వ్యక్తి కి ఒక్క PAN మాత్రమే కలిగి ఉండాలి.

Comments are closed.