Vande Bharath trains: దేశంలో 11 రాష్ట్రాలను కలుపుతూ 9 వందే భారత్ రైళ్ళను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడి

ప్రధానమంత్రి నరేంద్ర మోడి కొత్తగా 9 వందే భారత్ రైళ్ళను ప్రారంభించారు. 11 రాష్ట్రాలలో మతపరమైన, పర్యాటక ప్రాంతాలను కలుపుతాయి.

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 11 రాష్ట్రాలలో కొత్తగా 9 వందే భారత్ రైళ్లను (Trains) ప్రారంభించారు. ఈ తొమ్మిది రైళ్ళు 11 రాష్ట్రాలలోని మతపరమైన (Religious) మరియు పర్యాటక ప్రాంతాలను (Tourist areas) కలుపుతాయి. ప్రధానమంత్రి మోడీ ప్రారంభించిన 9 రైళ్ళలో అత్యంతగా ఎదురుచూసిన వాటిలో హైదరాబాద్- బెంగళూరు (Hyderabad-Bangalore) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒకటి, ఇది ప్రధాన నగరాలు రెండిటి మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

రైళ్ళను ప్రారంభించడానికి ముందు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) మాట్లాడుతూ, ” ప్రధాని నరేంద్ర మోడి ఆలోచనలో గడచిన తొమ్మిది సంవత్సరాలలో రైల్వే రంగం అనేక రకాల రూపాంతరాలను (transformations) చెందిందని అలాగే అనేక కొత్త సౌకర్యాల (facilities) ఏర్పాటు జరుగుతున్నాయి ” అని పేర్కొన్నారు.

కొత్త రైళ్ళను ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడి మాట్లాడుతూ, కొత్తగా ప్రారంభించిన తొమ్మిది వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు దేశ వ్యాప్తంగా గణనీయంగా అనుసంధానాన్ని (Connection) కలిగించడమే కాకుండా భారత దేశం మొత్తంగా పర్యాటకాన్ని పెంచుతాయని ప్రధాని మోడీ చెప్పారు.

Vande Bharath trains: Prime Minister Narendra Modi launched 9 Vande Bharath trains connecting 11 states in the country.
Image Credit : Mint

వందే భారత్ రైళ్ళకు క్రమేపీ (gradually) ఆదరణ పెరుగుతుందని, ప్రస్తుతానికి 1,11,00,000 మంది వందే భారత్ రైళ్ళలో ప్రయాణిస్తున్నారని పేర్కొంటూ దేశంలోని అన్ని ప్రాంతాలను వందేభారత్ రైళ్ళ ద్వారా కనెక్టివిటీని కలిగించే రోజు ఎంతో దూరంలో లేదు అని ప్రధాని పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ఒక ప్రకటనలో వందే భారత్ రైళ్ళను ప్రవేశ పెట్టడం ద్వారా దేశంలో రైల్వే సేవలలో నూతన ప్రమాణాలకు నాంది పలుకుతుందని, కవాచ్ టెక్నాలజీతో (technology) నిర్మితమవడం అలాగే ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నూతన భద్రతా (Security) లక్షణాలను కలిగి ఉంటుంది.

Also Read : చిన్న పిల్లలకు రైలులో టికెట్ తీసుకోవాలా, క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ

ప్రధాని మోదీ ఈరోజు జండా ఊపి ప్రారంభించిన 9 కొత్త రైళ్లలో ఉదయపూర్ – జైపూర్ (Udaipur – Jaipur) వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తిరునల్వేలి-మధురై- చెన్నై (Tirunelveli-Madurai-Chennai) వందే భారత్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ – బెంగళూరు (Hyderabad-Bangalore) వందే భారత్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ – చెన్నై (Vijayawada – Chennai) (రేణిగుంట మీదుగా) వందే భారత్ ఎక్స్‌ప్రెస్, పాట్నా – హౌరా (Patna – Howrah) వందే భారత్ ఎక్స్ ప్రెస్, కాసరగోడ్ – తిరువనంతపురం (Kasaragod – Thiruvananthapuram) వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రూర్కెలా – భువనేశ్వర్ – పూరీ (Rourkela – Bhubaneswar – Puri) వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాంచీ – హౌరా (Ranchi – Howrah) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు జామ్‌నగర్-అహ్మదాబాద్ (Jamnagar-Ahmedabad) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.

Also Read : మోడీ నా మజాకా, అరవైలో ఇరవైలా ఉన్న ప్రధాని మోడీ. ప్రధాని ఫిట్ నెస్ రహస్యం తెలుసా?

ఈ వందే భారత్ రైళ్ళు అవి తిరిగే మార్గాల్లో అత్యంత వేగవంతమైనవిగా (As the fastest) ఉంటాయని, ప్రయాణీకులకు విలువైన  సమయాన్ని (valuable time for passengers) ఆదా చేయడంలో సహాయ పడుతాయని PMO విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Comments are closed.