Madras High Court: భర్త ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందా? అద్భుతమైన తీర్పు ఇచ్చిన మద్రాస్ హై కోర్ట్..

Telugu Mirror: సాధారణంగా ప్రతి ఇంట్లో ఇంటి పని వంట పని పిల్లల భద్రత అన్ని గృహిణులే చూసుకుంటారు. భర్త తీసుకు వచ్చిన సంపాదనతో భార్య ఇంటిని చక్కబెడుతూ ఇంటి బాద్యతలను చూసుకుంటారు. అయితే ఓ కేసులో భర్త ఆస్తిలో భార్యకి హక్కు ఉంటుందా అనే ప్రశ్నకు మద్రాస్ హై కోర్ట్ తీర్పునిచ్చింది .అయితే మద్రాస్ హై కోర్ట్ ఇచ్చిన తీర్పు అన్ని కోర్ట్స్ వాళ్ళు అనుసరించాలని రూల్ లేదు . కేవలం చట్టరూపేణా వచ్చిన వాటిని మాత్రమే అనుసరించాలి. అయితే ఆ కేసు ఏంటి ? మద్రాస్ హై కోర్ట్ ఇచ్చిన తీర్పు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

ఆ కేసు ఏంటి ? 

ఒక భర్త భార్యకు దూరంగా వేరే ప్రదేశంలో ఉండి పని చేస్తూ భార్యకు డబ్బులు పంపిస్తూ ఉన్నాడు . భార్య తన భర్త పంపిన డబ్బులతో ఇంటి క్షేమాన్ని, తమ పిల్లల క్షేమాన్ని చూసుకుంది . అయితే ఆ భర్త కు కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్(legal problems)  వస్తాయి అని తన భార్య పేరున కొంత ప్రాపర్టీ(property) ని తీసుకున్నాడు . ప్రాపర్టీ భార్య పేరున ఉంది కానీ డబ్బు మాత్రం భర్తదే . కొంత కాలానికి వారి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల ఆ ప్రాపర్టీ నాది అని భార్య అంటే కాదు డబ్బు నాది అని చెప్పి దిగువ స్థాయి కోర్ట్ కి పెటిషన్ వేసాడు . అయితే వారు వివాహమాడిన తర్వాత భార్యభర్తలు సంపాదించిన డబ్బు ఇద్దరికీ సమానంగా వస్తుంది అని తీర్పును ఇచ్చారు .దీనితో అతను మద్రాస్ హై కోర్ట్(madras high court)కు అప్పీలు చేసాడు . దిగువ కోర్ట్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలనీ కోరాడు .

Also Read:Gruha Lakshmi Scheme: మీ ఇంటి నిర్మాణం ఇంకా కలగానే మిగిలిందా? గృహలక్ష్మి పథకం తో నెరవేర్చుకోండి మరి!

image credit: the hindu

మద్రాస్ హై కోర్ట్ తీర్పు ఏంటి ? 

ఈ కేసు విచారించిన మద్రాస్ హై కోర్ట్ న్యాయమూర్తి ఆసక్తికరమైన వాక్యాలు చేసారు . భర్త సంపాదించడం భార్య ఆ సంపాదనతో కుటుంబ అవసరాలు , పిల్లలు , కుటుంబ పోషణ సర్వసాధారణం అని పేర్కొన్నారు. భర్త చేసే 8 గంటల పనికి 24 గంటల పని చేసే ఇల్లాలి శ్రమను పోల్చలేమని చెప్పారు.కాబట్టి భర్త డబ్బుతో కొన్న ఆస్తికి భార్యకు సమాన హక్కు ఉందని జస్టిస్ కృష్ణన్ రామసామి(justice krishnan rama swamy) తీర్పును ఇచ్చారు. భార్యభర్తలు కుటుంబానికి రెండు చక్రాల లాంటి వారని భార్యకు ఇచ్చే నగలు , చీరలు , ఇతర వస్తువులను బహుమతి లాగానే చూడాలి అని ఆయన చెప్పారు . కుటుంబానికి అన్ని విధాలా సహకారాన్ని అందిస్తున్న గృహిణులను గుర్తించే చట్టం లేదని .. ఆ సహకారాన్ని కోర్ట్ గుర్తించకుండా ఉండదని ఆయన పేర్కొన్నారు .

Leave A Reply

Your email address will not be published.