Jio Recharge : అంబానీ కుమారుడి పెళ్లి..జియో ఫ్రీ రీఛార్జ్.. నిజమేనా?

రిలయన్స్ యజమాని అయిన ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్ళి సందర్బంగా జియో వినియోగదారులకి శుభవార్త చెప్పారు. రూ.259 జియో రీఛార్జ్ ఉచితంగా అందిస్తున్నట్లు మరియు ఆ ప్లాన్ 30 రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.

Telugu Mirror : మన దేశంలో అత్యంత ధనికుడు ఎవరు అని అంటే అందరూ చెప్పే మాట ముఖేష్ అంబానీ (Mukesh Ambani). ఈ మధ్య ముఖేష్ అంబానీ కొడుకు ఐన అనంత్ అంబానీ (Ananth Ambani) పెళ్లి వేడుకల సందర్బంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల గుజరాత్ లోని జామ్నగర్ (Jamnagar) లో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇటీవల నీతా అంబానీ తన కొడుకు ప్రీ-వెడ్డింగ్ వేడుకలో క్లాసికల్ డాన్స్ వేసి ఒక్కసారే అందరి చూపు తనవైపు తిప్పుకుంది. రిలయన్స్ యజమాని అయిన ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్ళి సందర్బంగా జియో వినియోగదారులకి శుభవార్త చెప్పారు.

మరి ఇంతకీ ఆ శుభవార్త ఏంటి? జియో యూజర్లకి ఆ శుభవార్త ఉపయోగకరంగా ఉంటుందా? అనే విషయం గురించి తెలుసుకుందాం.

Also Read : AEE Results : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల ఫలితాలు విడుదల..ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా.!

జియో యూజర్స్ కి గుడ్ న్యూస్..

వచ్చే నెల అంటే ఏప్రిల్ నెలలో ముఖేష్ అంబానీ పుట్టిన రోజు మరియు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ పెళ్లి వేడుక జూన్ 12న జరగనుంది. అయితే, అంబానీ ఇంట శుభకార్యాలు జరుగుతుండడం వల్ల నెట్టింట ఒక న్యూస్ తెగ వైరల్ అయిపోతుంది.

Mukesh Ambani gives free Jio recharge on the occasion of his son's wedding.

జియో ఫ్రీ రీఛార్జ్..

అంబానీ పుట్టినరోజు మరియు అనంత్ పెళ్లి వేడుక సందర్భంగా, రూ.259 జియో రీఛార్జ్ (Jio Recharge)ఉచితంగా అందిస్తున్నట్లు మరియు ఆ ప్లాన్ 30 రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక  పోస్ట్ లింక్ బాగా పాపులర్ అయింది. అనేక వాట్స్ అప్ గ్రూపుల్లో ఉచిత రీఛార్జ్ ఆఫర్ కోసం లింక్‌ను క్లిక్ చేయమని మెసేజెస్ పంపుతున్నారు.

పుట్టినరోజు మరియు వివాహ వేడుకల సందర్భంలో జియో (Jio) కంపెనీ ఈ ఆఫర్‌ను భారతీయ వినియోగదారులకు అందిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జియో కంపెనీ భారతీయ సబ్‌స్క్రైబర్‌లందరికీ ఈ డీల్‌ని ప్రకటించింది మరియు రాబోయే మూడు రోజుల్లో దీని గడువు ముగుస్తుందని చెబుతున్నారు.

Also Read : Modi Telangana Visit 2024: ఎన్నికల ప్రచారంపై మోడీ దృష్టి, రేపు తెలంగాణ పర్యటన

ఇది ఫేక్ న్యూస్ అంట..!

అయితే, ఈ అంశంపై జరిగిన సమాచారం గురించి ఆరా తీస్తే అది ఫేక్ అని తేలింది. అదనంగా, Jio యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో అటువంటి ఆప్షన్ కూడా ఎక్కడ ప్రకటించలేదు. అంబానీ పుట్టినరోజు లేదా ముఖేష్ కుమారుడి వివాహం సందర్భంగా ఉచిత రీఛార్జ్ గురించిన న్యూస్ కి సంబంధించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న సందేశాలు నిజాలు కాదని తేలింది. మోసానికి పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు వీటిని తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments are closed.