New Districts in AP : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, మొత్తం ఎన్ని జిల్లాలంటే?

ఇప్పుడు 26 జిల్లాలున్న ఏపీని 32 జిల్లాలతో రాష్ట్రంగా మార్చేందుకు చంద్రబాబు సర్కార్ ఒక డ్రాఫ్ట్ ను రూపొందించింది. వివరాల్లోకి వెళ్తే..

New Districts in AP : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన చంద్రబాబు కోటమీ పరిపాలన ప్రజల కోరికలను తీర్చే ప్రయత్నాలను పెంచింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు చేస్తున్న యాత్రల్లో అదనపు జిల్లాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. అధికారంలోకి రాగానే భూభాగాలపై విచారణ జరిపి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే చంద్రబాబు పరిపాలన డ్రాఫ్ట్ జిల్లాలను ప్రతిపాదించింది.

ఇప్పుడు 26 జిల్లాలున్న ఏపీని 32 జిల్లాలతో రాష్ట్రంగా మార్చేందుకు చంద్రబాబు సర్కార్ ఒక డ్రాఫ్ట్ ను రూపొందించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే విధంగా అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలి కాబట్టి పక్కా క్లారిటీ రావాలంటే మరి కొంత సమయం పడుతుంది. అయితే డ్రాఫ్ట్ ప్రకటన ప్రకారం చంద్రబాబు పరిపాలన మరో ఆరు జిల్లాలను ఏర్పాటు చేయనుంది.

మరి కొత్త జిల్లాలు ఏంటి?

  • మదనపల్లె జిల్లా పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్ల పల్లె నియోజకవర్గాలు ఉండనున్నాయి.
  • పలాస జిల్లా — ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి
  • రాజమండ్రి జిల్లా — అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రూరల్ మరియు కొవ్వూరు నియోజకవర్గాలు ఉండనున్నాయి.
  • అమరావతి జిల్లా — పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామలతో నియోజకవర్గాలు ఉండనున్నాయి.
  • మార్కాపురం జిల్లా — ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలు ఉన్నాయి.
  • రాజంపేట జిల్లా — బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, మరియు రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలు.

New Districts in AP

ఇది కేవలం డ్రాఫ్ట్ మాత్రమే అని గమనించాలి. ప్రజల అభిప్రాయం విన్న తర్వాత ప్రభుత్వం అధికారికంగా జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటుంది. 2014లో ఏపీ విభజన తర్వాత 2021లో అప్పటి జగన్ ప్రభుత్వం పార్లమెంట్ సీట్ల ఆధారంగా రాష్ట్రాన్ని 25 జిల్లాలుగా విభజించింది. అయితే అరకు పార్లమెంట్ స్థానం పెద్దది కావడంతో రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి. వీటిని విస్తరించాల్సిన వస్తే 32 జిల్లాలు అవుతుంది.

New Districts in AP

Comments are closed.