Night Sunset Country: రాత్రివేళ సూర్యోదయం అయ్యే దేశం ఏంటో తెలుసా? చాలా మందికి ఈ విషయం తెలియదు

అర్ద రాత్రి ఉదయించే సూర్యుడు అని యూరప్ ఖండంలోని ఒక దేశాన్ని పిలుస్తారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Night Sunset Country: భూమి ఎంత అందంగా ఉంటుందో మన అందరికి తెలుసు. ఎన్నో వింతలు, విచిత్రాలు, కొన్ని కొన్ని సన్నివేశాలు ఆశ్యర్యానికి గురిచేస్తాయి. ప్రకృతి ఎంతో విశాలంగా పచ్చని చెట్లతో మనసుకి ప్రశాంతని కలిగిస్తుంది. అయితే, ప్రపంచంలో ఎన్నో వింతలు మనల్ని ఆశ్చర్య పరిచేలా చేస్తాయి.

సూర్యుని కిరణాలు భూమిపై అన్ని ప్రదేశాల్లోను ఒకే వాతావరాన్ని కలిగి ఉండదు. వాతావరణాన్ని(Climate) బట్టి సూర్యుని కిరణాలూ భూమిని తాకుతూ ఉంటాయి. అయితే, ఈ దేశంలో సూర్యుడు రాత్రి పూట ఉదయిస్తాడని మీకు తెలుసా? మరి ఇంతకీ రాత్రి ఉదయించే సూర్యుడు అని ఏ దేశాన్ని అంటారు. ఎందుకు అలా అంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read:Ganga River National River: గంగ నదిని జాతీయ నదిగా ఎందుకు ప్రకటించారు? ఎప్పుడు ప్రకటించారో తెలుసా?

ఆ దేశం పేరు ఏంటి?

అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అని నార్వే దేశాన్ని అంటారు. యూరప్ (Europe) ఖండంలో నార్వే (Norway) ఒక దేశం. ఇక్కడ రాత్రి 12:43 నిమిషాలకు సూర్యుడు అస్తమిస్తాడు. మరి ఆ టైంలో అస్తమిస్తే మళ్ళీ ఉడాయించాడు ఎక్కువ సమయం పడుతుంది అని అనుకుంటే మీ ఆలోచన తప్పే అవుతుంది. ఎందుకంటే, సూర్యుడు అస్తమించిన 40 నిమిషాల్లోనే మళ్ళీ సూర్యుడు (Sun) ఉదయిస్తాడు. అంటే, 1:30కే సూర్యుడు ఈ దేశంలో ఉదయిస్తాడు.

దీన్ని బట్టి చూస్తే, ఈ దేశం సూర్యుడు ఎప్పటికీ అస్తమించడు అనే చెప్పాలి. మరి, ఇలా ఎన్ని రోజులు పాటు జరుగుతుంది అంటే దాదాపు 76 రోజుల పాటు ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. అందుకే దీన్ని మిడ్ నైట్ సన్ (Mid Night Sun) అనే దేశంగా ప్రపంచం అంతా పిలుస్తారు. ఇకపోతే, ఈ అందాన్ని చూడడానికి దేశ నలుమూలల నుండి సందర్శిస్తూ ఉంటారు.

Comments are closed.