NTR Barosa Scheme: ఆ పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం, వైఎస్ఆర్ పేరు తొలగింపు

ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చాక పనులు చక చక పూర్తి చేస్తున్నారు. అయితే, వైఎస్ఆర్ పింఛను కానుక పేరును పేరును మార్చి మరో పేరుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

NTR Barosa Scheme: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం చక, చక పనులు కొనసాగిస్తుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) . ఐదు ఫైల్లపై సంతకాలు చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో పథకానికి పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. సామాజిక పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచిన ప్రభుత్వం.

ఈ పథకానికి ఉన్న పేరు కూడా మార్చింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన వైఎస్ఆర్ పింఛను కానుక పేరును ‘ఎన్టీఆర్ భరోసా’గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్ఆర్ పింఛను కానుక పేరును ‘ఎన్టీఆర్ భరోసా’గా

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఎన్నికల సందర్భంగా ప్రజలకు చేసిన పలు హామీలపై చంద్రబాబు గురువారం సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించి సంతకాలు చేశారు. వీటిలో సామాజిక భద్రత పెన్షన్ల పెంపుదల కూడా ఉంది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఎన్టీఆర్ భరోసా పేరుతో టీడీపీ పాలన సాగింది. ఆ తర్వాత, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. దాన్ని వైఎస్ఆర్ పింఛను కానుకగా మార్చారు.
ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ పింఛను కానుక పేరుని ఎన్టీఆర్ భరోసా గా మార్చింది.

Also Read: Kisan Vikas Patra Scheme : మీ డబ్బుని పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే, అసలుకి రెట్టింపు వడ్డీ వచ్చే స్కీం ఇదే!

ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు కట్టే కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డ్రమ్‌లు వేసేవారు, హిజ్రాలు, హెచ్‌ఐవి రోగులు, చేతివృత్తుల వారికి నెలకు రూ. 3 వేలు పెన్షన్ అందిస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతూ చంద్రబాబు నాయుడు సంతకం చేశారు.

వారికి ఏప్రిల్‌లో అమల్లోకి వస్తుంది. జూలై 1న రూ. 4,000 మరియు ఏప్రిల్ 1 నుండి మూడు నెలలకు రూ. 1,000 చొప్పున మొత్తం రూ. 7,000 అందించనున్నారు. వికలాంగుల (Handicap) కు ప్రస్తుతం రూ. 3 వేలు అందించనున్నారు. ఇక జూలైలో నుండి వారికి రూ. 6 వేలు అందుతాయి. రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పదవీ విరమణ పొందిన వారికి నెలకు రూ.2,758 కోట్లు, నగదు పెంపుతో ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

Comments are closed.