PF Rules Change: పీఎఫ్ రూల్స్ చేంజ్,ఇక ఆ డబ్బులు తీసుకోలేరు..!

EPFO తన కార్మికుల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి నాన్-రిఫండబుల్ అడ్వాన్స్ సదుపాయాన్ని అమలు చేసింది. వివరాల్లోకి వెళ్తే..

PF Rules Change: ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. కొన్ని నిబంధనలను మార్చారు. అయితే, ఈ నిబంధనల కారణంగా కార్మికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాధారణంగా, PF నగదు భవిష్యత్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని అవసరాల కోసం పొదుపు చేసుకుంటారు.

ఆ డబ్బు అనారోగ్యానికి, పిల్లల చదువులకు, పెళ్లిళ్లు వంటి వాటికి ఉపయోగపడుతుంది అని చాలా మంది భావిస్తారు. ముందస్తు నోటీసు లేకుండానే ఈపీఎఫ్‌ఓ (EPFO) కొత్త ఆంక్షలు విధించింది. దీంతో కార్మికులకు డబ్బులు తీసుకోలేకపోతున్నారు. PF ద్వారా ఇప్పటివరకు ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు ఏమిటి? తమ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం?

ముందస్తు సౌకర్యంలో భాగంగా కరోనా (Corona) మహమ్మారి సమయంలో డబ్బు విత్ డ్రా (Money With Draw) చేసుకోడానికి అందుబాటులో ఉంది. EPFO తన కార్మికుల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి ఈ నాన్-రిఫండబుల్ అడ్వాన్స్ సదుపాయాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా, కరోనా కాలంలో రెండుసార్లు డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది. సబ్‌స్క్రైబర్‌లు తమ ప్రత్యేక PF ఖాతాల నుండి రెండుసార్లు డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని అందించారు. మొదట కోవిడ్-19 వ్యాప్తి సమయంలో మరియు మళ్లీ కరోనా రెండవ వేవ్ సమయంలో అందించారు.

NPS New Withdrawal Rules: Now only 25% withdrawal allowed from pension account; New NPS Pension Withdrawal Rules with effect from February 1, 2024
Image Credit : Mint

Also Read: Pensioners Good News: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్, వారికి అదనపు పెన్షన్

కరోనా సమయంలో పని చేయలేని మరియు తక్కువ డబ్బు ఉన్న చాలా మంది ఎకోవిడ్-19 PF అడ్వాన్స్ సేవలను ఉపయోగించారు. మొట్టమొదటిసారిగా, ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKY) మార్చి 2020లో ఈ కోవిడ్ అడ్వాన్స్‌ని ఉపయోగించి PF ఖాతాల నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించే విధానాన్ని అమలు చేసింది. 2021లో రెండవ అవకాశాన్ని అందించిన కరోనా మళ్లీ విస్తరించింది. అయితే, ఈ సదుపాయాన్ని తొలగిస్తున్నట్లు ఈపీఎఫ్‌ ప్రకటించింది. EPFO జూన్ 12, 2024న ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఈసారి, కోవిడ్-19 మహమ్మారి తగ్గడంతో దాన్ని రద్దు చేసింది.

EPFO యొక్క ముందస్తు ఎంపిక PF ఖాతాలో ఉన్న మొత్తం నగదులో 75% నిధులను లేదా ఉద్యోగుల 3 నెలల కనీస వేతనం, డీఏ ఏది తక్కువైతే అది విత్‌డ్రా చేసుకోవడానికి వీలుని కల్పిస్తూ. ఒక నిబంధనను తీసుకొచ్చింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తక్కువ మొత్తాన్ని కూడా తీసుకునే వెసులుబాటుని కల్పించింది. ఆ తర్వాత కరోనా ప్రభావం తగ్గడంతో రద్దు చేశారు.

PF ఖాతా నుండి నిధులను తీసుకోడానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. గరిష్టంగా రూ. లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇది కేవలం ఆటో సెటిల్‌మెంట్‌ కిందకు వచ్చింది. మూడు రోజుల్లో ఖాతాలో డబ్బు జమ అవుతుందని ఇది సూచిస్తుంది.

Comments are closed.