PM Kisan 17th installment Update: రైతుల అకౌంట్లోకి రూ.2,000 జమ, ఎప్పుడంటే ?

పీఎం కిసాన్ 17వ విడత డబ్బులపై బిగ్ అప్డేట్ వచ్చింది. డబ్బులు జమ అయ్యేది ఎపుడో తెలుసుకుందాం.

PM Kisan 17th installment Update:  ప్రధానమంత్రి కిసాన్ యోజన (Kisan Yojana) అనేది దేశంలోని రైతులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం అని మన అందరికీ తెలుసు. ఈ పథకం అర్హులైన రైతులందరికీ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ ప్రణాళిక ఫిబ్రవరి 2019లో ప్రవేశపెట్టారు ఇక అప్పటి నుండి రైతులు ప్రతి సంవత్సరం రూ. 6,000 రూపాయల సహాయం పొందుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి రూ.6 వేలు జమ చేయడం ప్రారంభించింది. ఏప్రిల్ (April) నుండి జూలై (July) వరకు, ఆగస్టు నుండి నవంబర్ వరకు మరియు డిసెంబర్ నుండి మార్చి వరకు విడతల వారీగా ఎకరాకు రూ. 2,000 చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.

ప్రధాని మోదీ 16వ విడత పీఎం కిసాన్ (PM Kisan) నిధులను విడుదల చేశారు. ఈ డబ్బును ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా 9 కోట్ల మంది రైతులు లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వం నివేదించింది. విడుదల చేసిన మొత్తం రూ.21,000 కోట్లకు పైగా ఉంది.

Big update on PM Kisan 17th installment money. Let us know when the money will be deposited.

 

జూన్ చివరి వారంలో లేదా జులై మొదటి వారంలో

పీఎం కిసాన్ 17వ విడతపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ జూన్ చివరి నెలలో అయిన లేదంటే జూలై మొదటి వారంలో అయిన డబ్బులు జమ అవుతాయని నివేదికలు చెబుతున్నాయి.

పిఎం కిసాన్ యోజన కింద ప్రభుత్వ నిధులను అందుకోడానికి, రైతులు తప్పనిసరిగా ఇ-కెవైసి (e-KYC) ని పూర్తి చేయాలి. దానిని పూర్తి చేసిన వారికి PM కిసాన్ పరిగణలోకి వస్తుంది. మీరు మీ e-KYCని ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి. అలాగే, మీ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి. ఈ రెండు దశలను పూర్తి చేయకపోతే, పీఎం కిసాన్ విడత డబ్బు జమ కాదు. కాబట్టి, ఇప్పుడే e-KYC పూర్తి చేయండి.

PM Kisan 17th installment Update

Comments are closed.