Post Office Recurring Deposit, useful news: పోస్ట్ ఆఫీస్ రీకరింగ్ డిపాజిట్, 10 ఏళ్లలో 17 లక్షలు మీ చేతికి

ఇంట్లో నెలవారీ ఖర్చులు పోగా మిగిలిన డబ్బులు సేవింగ్స్ చేసుకుంటారు. ఇటువంటి వారి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది. అందులో భాగమైన RD గురించి తెలుసుకుందాం.

Post Office Recurring Deposit: ప్రతి ఒక్కరు తాము సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేయాలని అనుకుంటారు. ఇంట్లో నెలవారీ ఖర్చులు పోగా మిగిలిన డబ్బులు సేవింగ్స్ (Savings) చేసుకుంటారు. ఇటువంటి వారి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది. ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ (RD) పథకంలో డిపాజిట్ చేస్తే ఎంత మొత్తం లభిస్తుంది? ఎంత వరకు డిపాజిట్ చేయొచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందాం.

రీకరింగ్ డిపాజిట్ (Post Office Recurring Deposit)

పోస్ట్ ఆఫీస్ RD 6.7% వార్షిక వడ్డీ (Annual Interest) ని అందిస్తుంది. పోస్టాఫీసులో RD 5 సంవత్సరాలు ఉంటుంది. మీరు రూ. 100తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. దీనికి గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. మీరు పోస్టాఫీసులో రూ.1000, రూ. 2000, 3000, 4000 మరియు 5000 లతో పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో మంచి లాభాన్ని పొందుతారు.

  • ప్రతి నెల రూ.100 ఇన్వెస్ట్ చేస్తే అనగా ఒక్క రోజుకి రూ.33 పడుతుంది.
  • 5 ఏళ్లలో మొత్తం రూ.70,000 వరకు అవుతుంది.
  • మెచ్యూరిటీ సమయంలో మరో 5 ఏళ్ళు పొడిగించి 10 ఏళ్ల తర్వాత తీసుకుంటే మొత్తం రూ.1.70 లక్షల వరకు చేతికి వస్తుంది.
  • అదే, మీరు ప్రతి నెలా రూ. 1000 ఆర్డీని ప్రారంభిస్తే మెచ్యూరిటీ తర్వాత రూ. 71,366 అందుకుంటారు.
  • ప్రతి నెలా రూ. 2000 ఆర్డీని ప్రారంభిస్తే, మెచ్యూరిటీ సమయంలో రూ. 1,42,373 అందుకుంటారు.
  • ప్రతి నెలా రూ. 3000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 2,14,097 అందుకుంటారు.
  • ప్రతి నెలా రూ. 4000 ఆర్డీని ప్రారంభిస్తే, మెచ్యూరిటీ సమయం (maturity time) లో రూ. 2,85,463 అందుకుంటారు.
  • ప్రతి నెలా రూ. 5000 ఆర్డీని ప్రారంభిస్తే, మెచ్యూరిటీ సమయంలో రూ. 3,56,829 అందుకుంటారు.
  • ఇలా మనం నెలలో డిపాజిట్ చేసేదాన్ని బట్టి ఎంత వస్తుంది అని లెక్క వేయొచ్చు.

10 ఏళ్లలో 17 లక్షలు పొందాలంటే ?

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించడానికి మీరు ప్రతిరోజూ రూ.333 పెట్టుబడి పెట్టాలి. అంటే మీ నెలవారీ పెట్టుబడి (Monthly invest) రూ. 10,000. ఈ పథకం 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంది, కాబట్టి ఆ సమయంలో మీకు రూ.7.13 లక్షలు అవుతుంది. అయితే, మీరు ఈ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తే అంటే పదేళ్ల తర్వాత, మీ పెట్టుబడి విలువ రూ.12 లక్షలు, వడ్డీ రేటు రూ.5,08,546 ఉంటుంది. పదేళ్ల తర్వాత, అసలు మరియు వడ్డీతో కలిపి మీ మొత్తం రూ.17,08,546 అవుతుంది.

Post Office Recurring Deposit

Comments are closed.