గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింపు, ఎప్పటి నుండో తెలుసా?

పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో సెంట్రల్ వంట గ్యాస్‌పై రూ.100 తగ్గించడం అనేది ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 

Telugu Mirror : కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పెట్రోల్ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ న్యూస్ చాలా మందికి ఊరట కలిగిస్తుందనే చెప్పవచ్చు. పెట్రోల్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రధాని మోదీ తాజాగా ట్విట్టర్ (Twitter) ద్వారా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇది అద్భుతమైన ఒక వార్త. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (Women’s day) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అయితే, ఇక్కడ రెండు కీలకాంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో సెంట్రల్ వంట గ్యాస్‌పై రూ.100 తగ్గించడం అనేది ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read : Air Cooler : ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. దీని మీద AC కూడా పనికిరాదు, కేవలం రూ. 5500 లకే..

ఈ విషయంపై ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “ఈరోజు, మహిళా దినోత్సవం సందర్భంగా, మా పరిపాలన ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.100 తగ్గించింది. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై, ముఖ్యంగా అనేక మందికి ఆర్థిక భారాన్ని బాగా తగ్గిస్తుంది” అని మోడీ పేర్కొన్నారు.

 

“వంట గ్యాస్‌ను మరింత చవకగా చేయడం వల్ల, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు కుటుంబాల శ్రేయస్సును మెరుగుపరచాలని మేము ఆశిస్తున్నాము. ఇది మహిళలకు సాధికారత కల్పించడం మరియు వారికి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ (Ease of Living) అందించడం వీలుగా ఉంటుంది అని”  మోదీ ట్వీట్‌లో తెలిపారు. ఇది మహిళలకు కానుక అని ప్రధాని మోదీ చెబుతూ.. లోక్ సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో  కేంద్రం అలా చేసిందని కొందరు భావిస్తున్నారు. కారణం ఇదైనప్పటికీ, ఇది దేశ ప్రజలకు శుభవార్త అనే చెప్పాలి.

అయితే సిలిండర్ (Cylinder) ధర తగ్గింపు నిర్ణయం ఎప్పుడు అమలులోకి వస్తుంది? అనే విషయంపై క్లారిటీ లేదు. ఫలితంగా సిలిండర్ ధర ఎప్పుడు తగ్గుతుంది అనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే సిలిండర్‌ ధర స్థిరంగానే ఉన్నట్టు నిర్ణయించారు. ధరపై ఎటువంటి తగ్గింపు లేదు. కాబట్టి, తగ్గింపు ఎప్పుడు అందుబాటులో ఉంటుందో తెలియాల్సి ఉంది.

Also Read : Rs.300 cooking gas subsidy : వంట గ్యాస్ పై రూ.300 తగ్గింపు. ఏడాదిపాటు సబ్సిడీని పెంచిన ప్రభుత్వం

సిలిండర్ ధర తగ్గింపు ఏ రూపంలో ఉంటుందో కూడా తెలవాల్సి ఉంది. అంటే, సబ్సిడీలో తగ్గింపు ఉంటుందా? లేక నేరుగా ధర తగ్గింపు ఉంటుందా? అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. మరి సిలిండర్ ధర తగ్గింపు అందరికీ వర్తిస్తుందా? ఇది ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమేనా?అనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. సిలిండర్ల ధర తగ్గింపుపై చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి, ప్రభుత్వం త్వరలోనే ఈ అంశంపై  స్పష్టత ఇస్తుందని భావిస్తున్నారు.

Comments are closed.