Rain Falls in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన, ఐడీఎం వెల్లడి

ఈ రోజంతా తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కమ్ముకుంటున్నాయి. దక్షిణ తెలంగాణలో క్రమంగా భారీ వర్షాలు కురుస్తాయి.

Rain Falls in Telugu States: నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ పవనాలు మూడు రోజుల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌ మరియు దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య భారత ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే దక్షిణాదిలో షీర్ జోన్ ఒకటి. ఇది వాష్ బేసిన్ లాంటిది. అలాగే దక్షిణ తెలంగాణ (Telangana) లోనూ ఈదురుగాలుల వాతావరణం నెలకొంది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణలో నేటి నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తెలంగాణలో తీవ్ర వర్షాలు కురుస్తాయి. పిడుగులు అప్పుడప్పుడు సంభవిస్తాయి.

వర్షపాతం చూస్తే.. బంగాళాఖాతంలో మేఘాలు ఎక్కువగానే ఉన్నాయి. రోజంతా తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కమ్ముకుంటున్నాయి. కోస్తాంధ్రలో ఉదయం వర్షం పడుతుందని, మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత హైదరాబాద్‌తో పాటు పశ్చిమ తెలంగాణలో వర్షం పడుతుందని పేర్కొంది. ఇక, దక్షిణ తెలంగాణలో క్రమంగా భారీ వర్షాలు కురుస్తాయి.

Rain Falls in Telugu States

Also Read:Holidays Extended in Andhra Pradesh: విద్యార్దులకు గుడ్ న్యూస్, సెలవులు పొడిగింపు, రీఓపెన్ ఎప్పుడంటే?

సాయంత్రం 5 గంటల తర్వాత తెలంగాణలో భారీ, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షం రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది. అలాగే తిరుపతి, తిరుమలలో రాత్రి 8 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. ఈరోజు, మేఘాలు (Clouds) చల్లబడడంతో పలు చోట్ల వర్షం కురుస్తోంది.

బంగాళాఖాతంలో గాలి వేగం ఎక్కువగా ఉంది. ఇది గంటకు 28 నుండి 38 కి.మీ వీస్తుంది. ఏపీలో గంటకు 12 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తెలంగాణలో గాలులు గంటకు 10 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.

ఉష్ణోగ్రతను పరిశీలిస్తే తెలంగాణ గరిష్టంగా 30 నుంచి 37 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. ఏపీలో గరిష్టంగా 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తూర్పు రాయలసీమలో వేడి ఎక్కువగా ఉంది. దీనితో పాటు ఉత్తర తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తూర్పు రాయలసీమ, ఉత్తర తెలంగాణ కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేమ శాతం ఎక్కువగా ఉంది. ఏపీలో సగటున 53%, తెలంగాణలో 66 తేమ శాతం ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో గాలిలో తేమ శాతం పెరిగి వర్షం కురుస్తోంది.

Comments are closed.