CM Revanth Reddy : ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. మరో కొత్త పథకానికి వెల్కమ్.

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు జరుగుతుంది. పేదలకు న్యాయం చేకూరేలా అనేక ప్రయోజనాలు కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

CM Revanth Reddy : గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి పలు పథకాలను అమలు చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు హామీ పథకాలను ప్రజలకు అందించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు జరుగుతుంది. పేదలకు న్యాయం చేకూరేలా అనేక ప్రయోజనాలు కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఆరు హామీలపై సీఎం దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ పథకాలు అమలవుతున్నాయి. మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ (Rajeev Arogyashri) కార్యక్రమాలతో పాటు రూ. 500 గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ఇప్పటికే అమలు అయ్యాయి.

ఆరు హామీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తున్న ప్రభుత్వం.. ఇంకా అమలుకు కానీ పథకాలకు సంబంధించిన ప్రక్రియలను కూడా రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించి పేద, బలహీన వర్గాల కోసం సీఎం మరో ముఖ్య పథకాన్ని రూపొందిస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

CM Revanth Reddy

ప్రమాదాలకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఆదుకునేందుకు సరికొత్త ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రమాద బాధితుల కోసం తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ప్రమాదానికి గురైన వారికి లక్ష వరకు ఉచిత వైద్యం అందించడం ఈ పథకం లక్ష్యమని తెలిపారు. ఈ ప్రణాళిక అమలుకు సంబంధించిన విధివిధానాలు ఇప్పుడు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రమాదం జరిగి ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే లక్షల్లో ఫీజులు కట్టలేక సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే, అలాంటి వారందరికీ సహాయం అందించేందుకు ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. నివేదికల ప్రకారం, ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు సత్వర వైద్యం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.

CM Revanth Reddy

Also Read : Dharani Portal : భూ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం, వివరాలు ఇవే!

Comments are closed.