Corporate Education Fees : కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం, ఫీజు నియంత్రణపై సీఎం చూపు.. కొత్త చట్టం అమలు.

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి? రేవంత్ రెడ్డి దానికి సంబంధించి ఏం మాట్లాడారు అనే విషయాల గురించి తెలుసుకుందాం.

Corporate Education Fees : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు హామీలలను ఇప్పటికే అమలు చేసింది. మరి కొన్ని హామీలను అమలు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి? రేవంత్ రెడ్డి దానికి సంబంధించి ఏం మాట్లాడారు అనే విషయాల గురించి తెలుసుకుందాం.

సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం

సంచలన నిర్ణయాలు తీసుకునే సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో ఇష్టానుసారంగా నడుస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను (Corporate educational institutions) దారిలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. పెరుగుతున్న ఫీజుల గురించి తల్లిదండ్రుల నుండి ప్రభుత్వానికి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి ఈ విషయంపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటోందని నివేదికలు చెబుతున్నాయి. ఫీజుల వేధింపులతో గతంలో కొన్ని సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం మన అందరికీ తెలిసిందే.

Corporate Education Fees

కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం 

అయితే గతంలో ఈ విషయంపై చాలా సార్లు ఫిర్యాదులు వచ్చినా బిఆర్‌ఎస్‌ (BRS) ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదని చర్యలు చేపట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా మంది బీఆర్‌ఎస్ పార్టీ నేతలు తమకు కార్పొరేట్ విద్యాసంస్థలు ఉన్నాయని నమ్మడమే ఇందుకు కారణం.

ఇదిలావుండగా, అధిక ఫీజులు వసూలు చేస్తూ సగటు మనిషికి చదువును దూరం చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లపై నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవడంతో పాటు..ఫీజులు అదుపులో ఉంచేందుకు కొత్త చట్టాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల తరువాత దీనిపై ప్రత్యక చట్టం 

అయిలోక్‌సభ ఎన్నికల తే, ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ (Lok Sabha Election Code) అమలులో ఉన్నందున.. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఫీజుల నియంత్రణపై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రోటోకాల్‌లను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను కూడా ఆదేశించినట్లు సమాచారం.

మరోవైపు పరీక్షలు ముగిసి సెలవులు దగ్గరపడుతున్నాయి. అనేక సంస్థలు మరియు కళాశాలలకు అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఎన్నికలు పూర్తి అయ్యేసరికి పాఠశాలలు కూడా ప్రారంభం అవుతాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరి ఈ విషయంపై ఏం జరుగుతుందని తెలియాల్సి ఉంది.

Corporate Education Fees

Comments are closed.