Excellent Indiramma Housing Scheme : మరో హామీకి శ్రీకారం చుట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వారికి మాత్రమే రూ.5 లక్షలు

Excellent Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్లు పధకానికి అడ్డంకులు తొలగి పోయాయి. తాజాగా ఈ పధకానికి సంభంధించి రాష్ట్ర ప్రభుత్వానికి హడ్కో రుణం మంజూరు చేసేందుకు అంగీకరించడంతో ఇందిరమ్మ ఇళ్ళ పధకం ముందుకు సాగనుంది.

Excellent Indiramma Housing Scheme : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ముందుకు వెళుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ (CM Revanth Reddy Cabinet) సమయానుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల మన్ననలను పొందుతున్నాయి.

ఎలక్షన్లలో ఇచ్చిన హామీలలో భాగంగా అధికారం లోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే కొన్ని కీలక పథకాలు అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఎలక్షన్ హామీలలో ఒకటైన ఇందిరమ్మ ఇండ్లపై (Indiramma Housing Scheme) ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలను (Six guarantees) తూ.చా. తప్పకుండా అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పేదలకు, దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న బీపీఎల్ కుటుంబాలకు ఆసరాగా నిలిచి ఉంటాం అని చెబుతోంది.

ఆరు గ్యారంటీలలో ఒక భాగమైన గృహ జ్యోతి పధకాన్ని (Gruha Jyothi Scheme) ఇటీవలనే అమలు చేసి పేదలు, అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ (Zero Current Bill), గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయల సబ్సిడీపై అందిస్తున్నారు. ఆపై ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల పధకం కింద ఇళ్ళు మంజూరీ చేసి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించబోతున్నారు. ఈ పథకం ప్రారంభంలో నిర్మించే ఇండ్ల యొక్క మోడల్ ను కూడా చూపించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పధకం అమలు కోసం అయ్యే బడ్జెట్ పై దృష్టి పెట్టిన సర్కారు హడ్కో నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

సూత్రప్రాయంగా గడచిన మార్చి నెలలో ఈ పధకాన్ని ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Govt). ఇందుకోసం హడ్కో నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించిన ప్రకారం, పధకం యొక్క తీరు తెన్నులను ప్రతిపాదనల రూపంలో పంపింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం అమలు కోసం రూ.5 వేల కోట్ల రుణం కావాలని హడ్కోకి పంపిన ప్రతిపాదనలలో రాష్ట్ర ప్రభుత్వం కోరగా అందుకు హడ్కో నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తాజాగా రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేసేందుకు హడ్కో ఒప్పుకుని ప్రభుత్వానికి తెలిపింది.

Indirama Houses Scheme Big Update

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి గాను రూ.850 కోట్లను తొలిదశగా విడుదల చేయాలని హడ్కో రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో ప్రకటనతో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి కీలకమైన ముందడుగు పడినట్లయింది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను ఇందిరమ్మ ఇండ్ల పధకంలో భాగంగా మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏటా 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రణాళికలు సిద్ధం చేసి లబ్ది దారుల ఎంపికపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పధకం అమలుకై ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం, మహిళ పేరు మీద ఇంటిని మంజూరు చేస్తారు. ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వారు మాత్రమే అర్హులు. పధకం అమలులో తొలి దశలో సొంత స్థలం ఉండి, ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం చేయనున్నారు. లబ్ధిదారులు స్థానికులై ఉండాలి. సొంత స్థలం ఉండి, ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్నవారు కూడా ఈ పధకానికి అర్హత కలిగి ఉంటారు.

ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి వస్తే సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే, ఇప్పుడు ఈ పధకానికి మొత్తం నాలుగు దశలలో రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించనున్నారు.

మొదటిగా బేస్ మెంట్ లెవల్ లో లక్ష రూపాయలు, రెండవ దశలో స్లాబ్ లెవెల్ లో మరో లక్ష, మూడవ దశలో భాగంగా స్లాబ్ పూర్తయిన వెంటనే 2 లక్షల రూపాయలు, చివరిగా ఇల్లు పూర్తయిన అనంతరం ఆఖరి లక్ష రూపాయలు ఇవ్వనున్నారు.

Excellent Indiramma Housing Scheme

Comments are closed.