Kalyana Lakshmi scheme : వారి అకౌంట్లోకి రూ.లక్ష జమ, తులం బంగారం కూడా ఉచితమే.

పథకాల అమలుపై రేవంత్ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 725 కోట్లకు అప్రూవల్ ఇచ్చింది.

Kalyana Lakshmi scheme : తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చుకుంటూ వస్తుంది. దానిలో భాగంగా తులం బంగారంతో పాటు రూ.లక్ష సాయం చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల లబ్ధిదారులకు డబ్బు, బంగారం రెండూ అందుతాయి. తెలంగాణలో (Telangana) ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కృషి చేస్తుందన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైన ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంచింది.

ప్రస్తుతం, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha elections) ముగిశాయి.కానీ, ఎన్నికల కోడ్ (Election Code) అమలులో ఉంటుంది. వచ్చే నెల నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఎన్నికల నేపథ్యంలో వీలైనంత త్వరగా పథకాల అమలుపై రేవంత్ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఎన్నికల ఫలితాల వెల్లడి తరువాత, ఎన్నికల కోడ్ ఎత్తివేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల అమలుకు సిద్ధం చేస్తుంది. వీటిపై అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.

Kalyana Lakshmi scheme

కల్యాణలక్ష్మి (Kalyan Lakshmi) అనేది కాంగ్రెస్ ప్రభుత్వ హామీలలో ఒక ముఖ్యమైన పథకం. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగానే అధికారులు రూ.లక్ష ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇంకా, ఎన్నికల కోడ్ గడువు ముగిసిన వెంటనే దీనిని పూర్తి చేయడానికి నిధులు కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 725 కోట్లకు అప్రూవల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికల కోడ్ పూర్తయితే లక్ష రూపాయలతో పాటు బంగారం కూడా అందిస్తుంది అని సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం నగదును మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి పథకం (Kalyan Lakshmi Scheme) అమలు కోసం రాష్ట్రంలో చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. కొంత మంది కళ్యాణ్ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకుని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తులం బంగారంతో పాటు రూ.లక్ష అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.

Kalyana Lakshmi scheme

Comments are closed.