New Electric Buses in Hyderabad హైదరాబాద్ లో 22 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం, ఇవి కూడా మహిళలకు ఫ్రీ

తెలంగాణ సర్కార్ ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందువల్ల బస్సుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఆ రద్దీని తగ్గించే దిశగా తెలంగాణ సర్కార్ కొత్త బస్సులను ఏర్పాటు చేసే కొన్ని చర్యలు తీసుకుంటుంది.

New Electric Buses in Hyderabad తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. రోజు ఎంతో మంది బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఇక ఉచిత బస్సు సౌకర్యం కల్పించగానే రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఈ బస్సులను వినియోగిన్చుకుంటున్నారు.

కొత్త బస్సులు ఏర్పాటు..

తెలంగాణ సర్కార్ ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందువల్ల బస్సుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఆ రద్దీని తగ్గించే దిశగా తెలంగాణ సర్కార్ కొత్త బస్సులను ఏర్పాటు చేసే కొన్ని చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ సిటీ లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త బస్సులను ఏర్పాటును చేస్తుంది. దీంతో ప్రయాణికులకు కాస్త ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు.

నేటి నుండి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి..

ఎక్కువ మంది ఫ్రీ బస్సు సౌకర్యం వినియోగించుకోవడం వల్ల గతంలో అనుకున్న ఎలక్ట్రిక్ బస్సులు నేటి నుండి అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ లో 22 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ అధికారులు ప్రారంభించడానికి సిద్దాయం అయ్యారు. ఈ బస్సులను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రవాణా  శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిచనున్నారు.

అయితే, మొత్తం 500 బస్సులు అన్ని ఆగష్టు లో వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ బస్సులు అన్ని పూర్తిగా నాన్-ఏసి బస్సులు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు పాత మెట్రో ఎక్స్ప్రెస్ ల స్థానంలో తీసుకొస్తున్నట్లు అధికారులు తెలియజేసారు.

ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..

ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలు తమ ఆధార్ కార్డు ని చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. BHEL, మియాపూర్, కంటోన్మెంట్, HCU మరియు రాణిగంజ్ డిపోలలో బస్సులను ఛార్జ్ చేయడానికి 33 KV విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆర్టీసీ 565 డీజిల్ బస్సులను ప్రత్యేకంగా  అందిస్తోంది. 125 మెట్రో డీలక్స్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ బస్సులు జూన్‌లో అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్‌ప్రెస్, 140 ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులన్నీ మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బస్సులు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. సీట్లు పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ అందుబాటులో ఉన్నాయి.

New Electric Buses in Hyderabad

 

 

 

 

Comments are closed.