Telangana Raithu Barosa 2024: వీరికి మాత్రమే రైతు భరోసా, నేడు కేబినెట్ నిర్ణయం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీకి తగ్గట్టుగా రైతు పంట పెట్టుబడి సాయం  కింద రూ.15 వేలు, కౌలుదారులకు రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. 

Raithu Barosa 2024: తెలంగాణ రైతు భరోసా పథకం గురించి మన అందరికీ తెలిసిందే. ఈ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ప్రవేశపెట్టింది. రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి రైతులకు ఎంతగానో సహాయం అందిస్తుంది.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే పలు పథకాలను అమలు చేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పెంచారు. తాజాగా, గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్, కేవలం రూ. 500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు కూడా అమలు చేశారు. ఇచ్చిన ఆరు హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పుకొచ్చారు. మిగిలిన పథకాల అమలు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతు భరోసా

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రవేశ పెట్టి, రైతులకు అండగా ఎకరాకు రూ.5000 చొప్పున ఇచ్చుకుంటూ వచ్చింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీకి తగ్గట్టుగా రైతు పంట పెట్టుబడి సాయం కింద రూ.15 వేలు, కౌలుదారులకు రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు చేసే భూములకు కాకుండా కొండా, మిట్టభూములకు, గుట్టల పేరు మీద కూడా రైతుభోరోసా ని అందించారని తెలిపారు. ఈసారి అటువంటి పొరపాటు చేయకుండా కేవలం సాగుభూములు మాత్రమే రైతు పంట పెట్టుబడి సాయం అందించాలని ఇప్పటికే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. అది కూడా 5 ఎకరాల పరిమితిని కూడా విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

నేడు క్యాబినెట్ మీటింగ్.

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తున్న ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పంటల బీమాను కూడా వచ్చే వర్షాకాలం నుండి అమలు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై కూడా మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. రైతుభరోసా పథకంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే విషయంపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి నేడు జరిగే క్యాబినెట్ మీటింగ్ లో ఏమి జరగనుందో వేచి చూడాలి.

Telangana Raithu Barosa 2024

 

 

 

Comments are closed.