Notifications Released By Telangana And Andhra: ఇటు తెలంగాణలో గ్రూప్-1 పోస్టులు పెంపు, అటు ఆంధ్రలో డీఎస్పీ పోస్టుల ప్రకటన

నిరుద్యోగులకు శుభవార్త, ఇటు తెలంగాణలో గ్రూప్-1 పోస్టులు పెంపు, అటు ఆంధ్రలో డీఎస్పీ పోస్టులకు ప్రకటన..

Notifications Released By Telangana And Andhra: తెలంగాణలో కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో విడుదలైన గ్రూపు 1 నోటిఫికేషన్ కు సబంధించి పోస్టులను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మరో 60 పోస్టులను పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబందించి ప్రభుత్వం 503 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల ఆ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. సమీక్ష జరిపిన అధికారులు గ్రూప్ 1 పోస్టులను 563కు పెంచుతున్నట్లు ప్రకటించారు. పోస్టులు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గ్రూపు 1కు ప్రిపేర్ అయితున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Good News For Un Employed Youth By Job Notifications Released By Telangana And Andhra

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సైతం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీ 2024ను ప్రకటించారు. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ మెగా డీఎస్సీలో.. మొత్తం 6100 పోస్టులు ఉన్నాయి. దీంట్లో 2299 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 2280 ఎస్‌జీటీ పోస్టులు, 1264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, 42 ప్రిన్సిపాల్‌ పోస్టులు ఉన్నాయి.
ఫిబ్రవరి 12నుంచి 22 వరకు డీఎస్సీ దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

 

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో నిరుద్యోగులు ఉద్యోగాలపై ఆశలు పెంచుకున్నారు. ఈ మేరకు నగరాల్లోని కోచింగ్ సెంటర్లల్లో భారీగా చేరుతున్నారు. ఈ మేరకు భారీగా ఉద్యోగాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ క్రమంలోనే గ్రూపు 1 నోటిఫికేషన్ లో పోస్టులు పెంచుతూ ఉత్తర్వలు విడుదల చేశారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్లు నిండుతున్న క్రమంలో.. త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలో నిరుద్యోగుల మద్దతు కూడగట్టే పనిలో వైసీపి ఉన్నది. అందులో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నిరుద్యోగులు ఉద్యోగాలు కొట్టాలని ప్రిపరేషన్ కు సిద్దం అయితున్నారు..

Comments are closed.