Rythu Bharosa Update, useful news : రైతు భరోసా నిధులు వచ్చేది అప్పుడే, అప్పటి వరకు ఆగాల్సిందే.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో ముఖ్యమైన ఆరు గ్యారంటీల అమలుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

Rythu Bharosa Update : తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో ముఖ్యమైన ఆరు గ్యారంటీల అమలుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆరు గ్యారంటీలలో ఇప్పటికే కొన్ని పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోంది. మిగిలిన హామీలను కూడా అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తలు చేస్తోంది.

100 రోజుల్లో హామీల అమలు

కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించి అధికారంలోకి తీసుకువస్తే, తమ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో హామీల అమలులో భాగంగా ఆరు గ్యారంటీల్లోని (Six guarantees) అన్ని పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. కానీ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కొత్తగా అమలు చేయాలనుకున్న పథకాల ప్రారంభం ఆగిపోయింది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల విద్యుత్ ఉచిత పధకం, రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇప్పటికే అమలు చేసింది.

ప్రస్తుతం, రైతుభరోసాపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తుంది.  ఎన్నికల కోడ్ కారణంగా అనేక కార్యక్రమాల అమలును వాయిదా వేసిన ప్రభుత్వం, సార్వత్రిక ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత రైతు భరోసాను ప్రారంభించాలని భావిస్తోంది.

Rythu Bharosa Update

గతంలో రైతు బంధు. 

ఈ పథకం గతంలో రైతు బంధు పేరుతో అమలయ్యేది. ఇప్పుడు రైతు భరోసాగా రేవంత్ ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఇప్పటికే ఎన్నికలకు ముందు నిలిచిపోయిన రైతు బంధువుల నుంచి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. కేసీఆర్ హయాంలో రైతుబంధు సొమ్ము మొత్తం అందించారు.

జూన్ లో నిధులు జమ. 

ఇప్పుడు, జూన్‌లో కాంగ్రెస్ రైతు భరోసా (Rythu Bharosa) పథకాన్ని అధికారికంగా అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే గతంలా కాకుండా పేద రైతులకు మాత్రమే ఈ రైతు బీమా అందేలా చర్యలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న వ్యవసాయ భూమిలో మాత్రమే రైతు భరోసా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

నివేదికల ప్రకారం, రైతు భరోసా వ్యవసాయ సహాయం మొత్తం ఒక సంవత్సరం వ్యవధిలో ఎకరాకు రూ.15,000 అందిస్తారు. అయితే ఈ డబ్బు మొత్తం ఒకేసారి పంపిణీ చేస్తారా? లేదా రెండు విడతలుగా ఒక్కొక్కటి రూ. 7,500గా చేస్తారా? అనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం కఠిన షరతులు విధిస్తుంది. భూస్వాములు, ఆదాయపు పన్ను చెల్లించే సంపన్నులు, ప్రభుత్వ అధికారులకు ఈ పథకాన్ని నిలిపివేయాలని, ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు బీమా మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Rythu Bharosa Update

 

Comments are closed.