Telangana Pensions : వృద్ధాప్య పింఛను అమలు చేసే దిశగా ప్రభుత్వం.. ఇక నెలకు రూ.4,000 జమ.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం హామీల అమలు ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీల కింద ప్రకటించిన పథకాలను ఇప్పటికే కొన్ని అమలు చేసింది.

Telangana Pensions :  తెలంగాణలో(Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం హామీల అమలు ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీల కింద ప్రకటించిన పథకాలను ఇప్పటికే కొన్ని అమలు చేసింది.

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు.

మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు ఆర్టీసీ (RTC) బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ ధరలు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, చేయూత పథకంలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీకి రూ.10 లక్షలు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల హామీ కింద రూ.5 లక్షల అందించడం వంటివి హామీలను ఇప్పటికే అముల్లోకి తీసుకొచ్చింది.

అయితే, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో మరికొన్ని హామీలు అమలు చేయాల్సి ఉంది. మహిళలకు నెలకు రూ.2500, రైతులకు ఎకరాకు రూ.15000, కూలీలకు రూ.12000, వరి పంటలకు రూ.500 బోనస్, యువ వికాస్ పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షల బీమా కార్డు, వృద్దులకు రూ. 4000 పెన్షన్ అందించాలి.

 Telangana Pensions

మిలిగిన హామీలను నెరవేర్చే దిశగా..

అయితే, మిగిలిన హామీలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆ హామీలను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రూ.2500 మహిళలకు, రైతులకు రూ. 15 వేలు, వృద్ధాప్య పింఛను రూ. 4 వేలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు పింఛన్లు వీలైనంత త్వరగా అందించే అవకాశం ఉంది.

వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే దిశగా.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు నెలకు రూ.2,000 పింఛను అందుతోంది. అయితే, రూ.2,000 కాస్త రూ.4,000కు పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్ట్లో హామీ ఇచ్చింది. ఆరు హామీలను కూడా ఇంకా అమలు చేయాల్సి ఉంది. మరి ఈ పథకం ఎప్పుడు అమలులోకి వస్తుంది? అని వృద్ధులు ఎదురుచూస్తున్నారు.

చేయూత పథకం అమలైతే వృద్ధులకు అదనంగా రూ. 2,000 అందుతాయి. ప్రతి నెలా రూ. 4 వేలు వారి ఖాతాల్లోకి జమ చేస్తారు. వీలైనంత త్వరగా ఈ విధానాన్ని అమలు చేయడం మంచిది. ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తులు చేస్తుంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త పథకాలను ప్రారంభించే అవకాశం లేదు. ఫలితంగా ఎన్నికల నేపథ్యంలో జూన్ మొదటి వారంలో ఈ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.

Telangana Pensions

Comments are closed.