Telangana Tourism Package : భాగ్యనగర వాసులకు శుభవార్త.. వీకెండ్ లో వన్ డే టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలు ఇవే.

ఈ సమ్మర్ లో అధ్యాత్మిక లేదా పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు వెళ్లే ఆలోచన ఉందా, అయితే చాలా తక్కువ ధరతోనే టెంపుల్ టూర్ ప్యాకేజీని తెలంగాణ టూరిజం ప్రకటించింది.

Telangana Tourism Package : ప్రస్తుతం పిల్లలకు వేసవి సెలవులు నడుస్తున్నాయి. ఈ వేసవిలో చాలా మంది అందమైన ప్రదేశాలకు పర్యటనలు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుత జాబ్ బిజీ లైఫ్ కారణంగా చాలా మంది ఎక్కువ రోజులు సమయాన్ని వెచ్చించలేరు. అలాంటి వారికి తెలంగాణ టూరిజం తగిన ట్రావెల్ ప్యాకేజీని (Travel package) అందించింది. ఈ టూర్ ప్యాకేజీ ఒక రోజు వ్యవధితో అందుబాటులోకి వచ్చింది. కాబట్టి, ప్యాకేజీలో ఏ అంశాలు కవర్ చేయబడ్డాయి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతీ శనివారం ఈ విహార యాత్రను ఆపరేట్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌-కొండపోచమ్మ-వేములవాడ-కొండగట్టు-హైదరాబాద్‌ పేరుతో ఈ పర్యటన సాగుతోంది. ఈ ప్రయాణం AC మినీబస్సులో ఉంటుంది. ధర విషయానికొస్తే పెద్దలకు ఒక్కొక్కరికీ రూ. 1799 కాగా చిన్నారులకు రూ. 1439గా నిర్ణయించారు. దర్శనం, ప్రవేశ టిక్కెట్లు మరియు భోజనం ప్యాకేజీలో చేర్చబడలేదు. టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Telangana Tourism Package

టెంపుల్ టూర్ ప్యాకేజీ షెడ్యూల్ వివరాలివే :

  • బషీర్ బాగ్‌లోని సీఆర్‌వో (CRO) కార్యాలయం నుంచి ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరుతుంది.
  • రాత్రి 9 గంటలకు కొండపోచమ్మ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు. ప్రయాణం మధ్యలోనే బ్రేక్‌ ఫాస్ట్‌ (Breakfast) చేయాల్సి ఉంటుంది.
  • కొండపోచమ్మ రిజర్వాయర్ (Reservoir) నుంచి ఉదయం 10 గంటలకు బస్సు బయలుదేరుతుంది.
  • ఆ తర్వాత 11 గంటలకు కొమరవెల్లి చేరుకుని అక్కడికి వెళ్లాలి.
  • అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వేములవాడకు పయనమవుతారు. వేములవాడకు దాదాపు 2 గంటలకు చేరుకుంటారు.
  • మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు దర్శనం మరియు భోజనం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరుతారు.
  • సాయంత్రం 5 గంటలకు కొండగట్టు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు కొండగట్టులో దర్శనం అవుతుంది.
  • తర్వాత, హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణం ప్రారంభమవుతుంది, హైదరాబాద్ వచ్చేసరికి సుమారు 10 గంటల సమయం అవుతుంది.
  • టూర్‌ను బుక్‌ చేసుకోవడం కోసం మరియు పూర్తి సమాచారం కోసం https://tourism.telangana.gov.in వెబ్ సైట్ ని సందర్శించండి.

Telangana Tourism Package

Comments are closed.