Telangana Weather Update : తెలంగాణలో భానుడి భగ భగలపై వాతావరణ శాఖ నీళ్ళు.. ఇక ఆ రోజు నుంచి వర్షాలే.

రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న వేళ వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది. రానున్న కొద్ది రోజులలో తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఇది కాస్తైనా ఉపశమనం కలిగించే వార్త

Telangana Weather Update : ప్రచండ భానుడి భగ భగలతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందింది. భారత వాతావరణశాఖ తెలంగాణ రాష్టానికి చల్లని కబురు చెప్పింది. రాష్ట్రానికి త్వరలో వర్ష సూచన ఉన్నదని, తెలంగాణ ప్రజలకు కొద్దిగా ఉష్ణతాపం నుంచి ఉపశమనం దొరకనుందని తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం తెలంగాణలో(Telangana) ఆరో తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుందని, 7, 8 తారీఖుల్లో రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ (Hyderabad) వాతావరణ కేంద్రం తాజా బులెటిన్‌లో (Latest Bulletin) వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణలో వచ్చే ఆది,సోమ వారాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, రాష్ట్రంలో బుధవారం నాడు ఈ వేసవిలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

బుధవారం నాడు తెలంగాణలోని (Telangana) ఖమ్మంతోపాటు భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఏప్రిల్ మొదటి వారంలోనే అధిక ఉష్ణోగ్రతలు (Temperatures) రికార్డ్ అయితే రానున్న రోజులలో వాతావరణం ఎలా ఉంటుందోనని ప్రజలు భయానికి గురవుతున్నారు. ఇదిలావుండగా గురువారం నుంచి ఉష్ణోగ్రతలు (Temperatures) మరింత పెరుగనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఎల్‌నినో పరిస్థితులు జూన్‌ చివరి వరకు కొనసాగుతుండటంతో ఈ వేసవిలో ఎండలు అధికంగానే ఉంటాయని భావిస్తున్నారు.

Telangana Weather Update

బుధవారం నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలుగా రికార్డ్ అవుతున్నాయి. నల్లగొండలో 40, మెదక్ 40,రామగుండం40, నిజామాబాద్ 41.2, ఆదిలాబాద్ లో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎండలు, వేడి గాలులు (వడగాడ్పులు) అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాకు వచ్చింది. IMD అంచనా ప్రకారం మరీ ముఖ్యంగా మే నెలలో సాధారణ ఉష్ణోగ్రతకంటే 5 నుంచి 8 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు, వడగాడ్పులు ప్రతాపం చూపనున్నాయని పేర్కొంది.

ఆర్టీసీ సిబ్బందికి మజ్జిగ పంపిణీ 

వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజా రవాణా ఆగకూడదని మండుటెండల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్.టీ.సీ. సిబ్బందికి టీ.ఎస్‌.ఆర్టీసీ మజ్జిగ సరఫరా చేస్తున్నది. తీవ్ర ఎండలకు తోడు ట్రాఫిక్‌ కష్టాలు, ఇంజిన్‌ వేడి.. వంటి పరిస్థితుల నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న కార్మిక సోదరులు, గ్యారేజీ మరియు డిపో సిబ్బంది అందరికీ అన్ని డిపోలలో మజ్జిగ అందించాలని టీ.ఎస్.ఆర్టీసీ నిర్ణయించింది

Telangana Weather Update 

Comments are closed.