TSRTC Name Change : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. టీఎస్ఆర్టీసీ పేరు మార్పు, కొత్త పేరు ఏమిటంటే?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. టీఎస్ ఆర్టీసీ పేరు మారనుంది.

TSRTC Name Change : తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ కారణంగా కొత్త బస్సులను కూడా ప్రారంభించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. అయితే, మహిళలకు ఇది తీపి కబురు కావొచ్చు కానీ పురుషులకు మాత్రం చాలా ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కొత్త కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే, ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరు మారింది. TSRTC అధికారికంగా దాని పేరు మార్చడానికి ఎంచుకుంది. టీఎస్ ఆర్టీసీ పేరు మారనుంది. మరి ఇంతకీ దానికి కొత్త పేరు ఏమిటి?అనే విషయం గురించి తెలుసుకుందాం.

TSRTC Name Change

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అధికారికంగా స్థాపించారు. టీఎస్ ఆర్టీసీ పేరును టీజీఎస్ ఆర్టీసీగా ప్రభుత్వం మార్చింది. అంటే, TS RTCకి బదులుగా TGS RTC గా బస్సులలో కనపడనుండి. పేరు మార్పును అధికారులు కంఫార్మ్ చేశారు. అయితే, త్వరలో లోగోను మారుస్తున్నట్టు ప్రకటించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టీఎస్‌ అనే అబ్రెవేషన్ నుండి టీజీఎస్ గా మార్చేందుకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. తెలంగాణలోని అన్ని వ్యాపార, ప్రభుత్వ శాఖలను టీఎస్ నుంచి టీజీగా మార్చాలని రేవంత్ సర్కార్ తాజాగా ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఎస్‌ఆర్‌టీసీ పేరును టీజీఎస్‌ఆర్‌టీసీగా (TGS RTC) మార్చినట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దాంతో, @tgsrtcmdoffice, @tgsrtchq సంస్థ మార్చింది. ఈ కొత్త ఖాతాల ద్వారా ప్రజలు తమ పిర్యాదులు, సలహాలు తమ దృష్టికి తీసుకురావాలని సంస్థ కోరింది.

TSRTC Name Change

Comments are closed.