TSRTC Offer : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఆ చార్జీలు మినహాయింపు.

ప్రయాణికులకు టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

TSRTC Offer : వేసవి సెలవులు సెలవులు వచ్చేశాయి. పిల్లలు, పెద్దలు సమ్మర్ వెకేషన్ (Summer vacation) కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే, మీరు కూడా మీ పిల్లలతో టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? తక్కువ బడ్జెట్ లో మంచి ప్రదేశానికి వెళ్లనుకుంటే ఒక చక్కటి టూర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) ఒక బంపర్ ఆఫర్ ను తీసుకొచ్చింది. సుదూర ప్రయాణాలు చేయాలనుకులనే వారు ముందుగానే బస్సుల్లో రిజర్వేషన్ చేసుకుంటే ఇక ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రయాణికులకు టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. వివిధ ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు ఎనిమిది రోజుల ముందుగానే బుక్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజు నుండి మినహాయింపు పొందుతారని ఎక్స్ లో ఇలా ట్వీట్ చేశారు.

#TSRTC సుదూర ప్రయాణీకులకు రిజర్వేషన్ ఫీజులను మినహాయిస్తుంది. కనీసం 8 రోజుల ముందుగా తమ రిజర్వేషన్‌లను బుక్ చేసుకునే కస్టమర్‌లకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. టిఎస్‌ఆర్‌టిసి బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ల కోసం దయచేసి http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించండి’ అని ఆయన ట్వీట్ చేశారు. అయితే తాజాగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారి కోసం కూడా ఇదే నోటిఫికేషన్ విడుదలైంది.

tsrtc-rtc-jobs-in-telangana-new-notification-released
Image Credit : Sakshi Education

వేసవి రాకతో ఏపీలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానానికి తెలంగాణ నుంచి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి నుంచి శ్రీశైలానికి బస్సు సర్వీసులను పెంచాలని TSRTC నిర్ణయించింది. ఈ బస్సు సర్వీసులు MGBS నుండి ఉదయం 3:30 గంటలకు ప్రారంభమయి.. 11:45 గంటల వరకు కొనసాగుతుంది. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రాధాన్యతలను బట్టి రాత్రి లేదా పగటిపూట ఈ బస్సు సర్వీసులను తీసుకోవచ్చు.

పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య వల్ల హైదరాబాద్ (Hyderabad) మరియు సికింద్రాబాద్ నుండి విజయవాడకు బయలుదేరే బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు, ముందస్తు టిక్కెట్ బుకింగ్‌లపై (Ticket bookings) 10% తగ్గింపును ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఉచిత బస్సు అమల్లోకి వచ్చినప్పటి నుంచి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే, ఈ బస్సులను ఎంజీబీఎస్, జేబీఎస్, బీహెచ్ఈఎల్ తదితర నగరంలోని కీలక బస్ స్టేషన్‌లలో సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

TSRTC Offer

Comments are closed.