Yadadri Hundi : యాదాద్రి హుండీ ఆదాయం బాగా తగ్గింది. ఆదాయం ఎంత వచ్చిందంటే?

వైకుంఠంగా పిలవబడే తిరుమల తరహాలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తుల సంఖ్య భారీగా పెరిగింది.

Yadadri Hundi : తెలంగాణలో యాదద్రి పుణ్యక్షేత్రం గురించి మనం వినే ఉంటాం. తెలంగాణాలో ప్రసిద్ధి చెందిన ఈ యాదాద్రి పుణ్యక్షేత్రం రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరిగి ఎక్కువ రద్దీగా మారుతుంది. భక్తుల సంఖ్య పెరగడంతో ఇది తెలంగాణ తిరుపతిగా పేరుగాంచింది. శుక్ర, శని, ఆదివారాల్లో యాదాద్రి గుట్ట ఆలయం భక్తులతో విపరీతమైన రద్దీగా మారిపోయింది. ఉదయం నుంచే భక్తుల సంఖ్య పెరిగిపోతుంది.

వైకుంఠంగా పిలవబడే తిరుమల తరహాలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం తర్వాత.. ఆలయ నిర్మాణం, మాఢవీధులు, స్వామివారి పూజ కైంకర్యాలు, ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు, యాదాద్రి ప్రసాదాలతో తెలంగాణ తిరుమలగా రూపుదిద్దుకుంటుంది. ఇక భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో యాదాద్రి టెంపుల్ (Yadadri Temple) యొక్క ఆదాయం కూడా ఎక్కువగానే పెరిగింది. ఆలయ హుండీ నిండిపోతుంది.

Yadadri Hundi

అయితే, భక్తుల పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం భారీగా పడిపోయింది. గత ముప్పై రోజులుగా భక్తులు సమర్పించిన వివిధ కానుకల కారణంగా హుండీ రూ. 3.49 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) తెలిపారు.

భక్తులు హుండీలో నూట అరవై ఆరు గ్రాముల మిశ్రమ బంగారం, నాలుగు కిలోల ఏడు వందల యాభై గ్రాముల మిశ్రమ వెండిని వేసినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు పలు దేశాల కరెన్సీలు హుండీలో చేరాయి.

అమెరికా నుండి 1,163 డాలర్లు, ఆస్ట్రేలియా నుండి 5 డాలర్లు, యుఎఇ నుండి 210 దిరమ్స్, నేపాల్ నుండి 400 రూపీస్ మరియు సౌదీ అరేబియా నుండి 37 రియాల్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. సింగపూర్ నుంచి 40 డాలర్లు, కువైట్ నుంచి రెండు దినార్లు, ఖతార్ నుంచి 60 రియర్స్, ఒమన్ కి చెందిన 200 బైసాలు.. మరియు పోలాండ్, మారిషస్, శ్రీలంక తదితర దేశాల నుంచి తమ కరెన్సీ డబ్బులు హుండీలో చేరినట్లు సమాచారం.

Yadadri Hundi

Also Read : Tirumala Food : తిరుమలలో నాణ్యమైన, రుచికరమైన భోజనం.. ధర కూడా తక్కువే..!

Comments are closed.