TGS RTC BUS Alert: టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అలర్ట్, ఇకపై డీలక్స్ బస్సుల్లో ప్రయాణం

మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. వివరాల్లోకి వెళ్తే..

TGS RTC BUS Alert: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహిళా ప్రయాణికు (Women Passengers) ల సంఖ్య మరింతగా పెరిగింది.

బస్సులు అన్నీ కిక్కిరిపోతున్నాయి. ఇంకా, సిటీ బస్సుల  (City Buses) పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా టిక్కెట్టు కొనుగోలు చేసి ప్రయాణిస్తున్న వారికి సీటు దొరక్క అవస్థలు పడుతున్నారు. ఈ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్‌ (Hyderabad) లో కొత్త బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, నగర ప్రజలకు సౌకర్యవంతమైన రవాణాను ప్రారంభించడానికి మరో నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్.

మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత టీజీఎస్‌ ఆర్‌టీసీ (TGS RTC) బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సుల రాకపోకలు మరింత పెరిగాయి. హైదరాబాద్ నగరవాసులకు ఇప్పుడు 25 ఎలక్ట్రిక్ ఎసి (Electric AC) మరియు 25 నాన్ ఎసి  (NON AC) ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు జులై చివరి నాటికి మరో 450 ఎలక్ట్రిక్ బస్సులు సిద్ధం కానున్నాయి. ప్రయాణీకులకు మరింత ఆహ్లాదకరమైన మరియు సౌకర్యవంతమైన అనుభూతిని అందించడానికి ఆర్టీసీ అధికారులు త్వరగా ఈ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా మరో 125 ప్రీమియం బస్సుల (Premium Bus) ను నడపాలని నిర్ణయించింది.

Extra Charges

Also Read: Train Ticket Booking : 5 నిమిషాల ముందు కూడా ట్రైన్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు, ఎలానో తెలుసా?

జూలైలో ఈ బస్సులు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ విలాసవంతమైన బస్సులు హైదరాబాద్ నగరంలోని అన్ని ముఖ్యమైన రూట్లలో ప్రయాణించనున్నాయి. ఇదిలా ఉండగా మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) ద్వారా మహిళలు సిటీ, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అయితే, వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో కొత్త డీలక్స్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. ఈ బస్సుల్లో ప్రయాణించే వారందరూ తప్పనిసరిగా టికెట్ కలిగి ఉండాలని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

Comments are closed.