HDFC : దేశంలోనే మొట్టమొదటి కార్డ్.. అదిరిపోయే బెనిఫిట్స్ తో HDFC కొత్త క్రెడిట్ కార్డ్

Telugu Mirror : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC Bank) కొత్తగా తమ వినియోగదారులకు సరికొత్త క్రెడిట్ కార్డు(Credit card)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది కోబ్రాండెడ్ హోటల్ క్రెడిట్ కార్డు. దేశంలోనే ఈ విధమైన క్రెడిట్ కార్డు మార్కెట్ లోకి రావడం ఇదే మొదటిసారి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మారియట్ బోన్వాయ్ సంస్థతో తాజాగా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మారియట్ బోన్వాయ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తో కలసి క్రెడిట్ కార్డును తీసుకువచ్చింది. ఈ క్రెడిట్ కార్డ్ ప్రపంచ వ్యాప్త గుర్తింపు కలిగిన డిస్కవర్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో ఒకటైన డైనర్స్ క్లబ్ ప్లాట్‌ఫామ్‌(Diners Club Platform) మీద పని చేస్తుంది. ఇందులో ట్రావెల్ కు సంభందించిన లాభాలు ఉంటాయి.

Image credit : ipleaders

మారియట్ బోన్వాయ్‌(Marriott Bonvoy)లో ఈ కార్డ్ హోల్డర్స్ కి సిల్వర్ ఎలైట్ స్టేటస్ లభిస్తుంది. ప్రియారిటీ లేట్ చెక్ ఐట్స్, ఎక్స్‌క్లూజివ్ మెంబర్ రేట్లు, బోనస్ పాయింట్లు వంటి ఎన్నో బెనిఫిట్స్ లభిస్తాయి. కరోనా మహమ్మారి విజృంభణ అనంతరం ట్రావెల్ ట్రెండ్స్ ఊపందుకున్నాయని, అందుకే ఆ డిమాండ్‌ను లాభదాయకం చేసుకునేందుకు ఈ రెండు ప్రైవేట్ సంస్థలు ఒప్పంద భాగస్వామ్యం చేసుకున్నాయని చెప్పవచ్చు. కొత్త కార్డు తీసుకునే వారికి స్వాగత బహుమతులు లేదా కార్డు పునరుద్ధరణ చేసుకుంటే ఫ్రీ నైట్ అవార్డ్ లభిస్తుంది దానితో పాటు 15 వేల రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. మారియన్ హోటల్స్‌ సందర్శించి మీరు ఈ పాయింట్లను రిడీమ్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు ఉపయోగించి చేసే ప్రతి రూ. 150 ఖర్చుపై 8 వారియట్ రివార్డ్(Wariot Reward) పాయింట్లు లభిస్తాయి.

Reliance Jio : జియో ప్రీ-పెయిడ్ రూ.119 రీఛార్జ్ నిలిపివేత, దానికి బదులుగా కొత్త ప్లాన్ ప్రారంభం.

ఇక ట్రావెల్, డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాన్జక్షన్స్ కు సంబంధించి రూ. 150 ఖర్చుపై 4 మారియట్ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఇతరత్రా వ్యయంపై ప్రతి రూ. 150 పేమెంట్స్ పై 2 మారియట్ పాయింట్లు పొందొచ్చు. ఫ్యూయెల్, వాలెట్ రీలోడ్, రెంటల్స్ వంటి చెల్లింపులకు మినహాయింపు ఉంటుంది. డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ కూడా లభిస్తుంది. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది. ఈ కార్డ్ సంవత్సర ఫీజు రూ. 3000గా ఉంది. అయితే, ఈ కార్డు సౌలభ్యం కొంత మంది కే అందుబాటులోఉండొచ్చు. నెలకు రూ. 1 లక్షకు పైగా వేతనం పొందే వారికి మాత్రమే ఈ కార్డు పొందే అవకాశం ఉంది. ఎక్కువగా విదేశీ ప్రయాణాలు చేసే వారు, హోటల్స్‌లో విడిది చేసే వారికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రీమియం కార్డు కనుక చాలా కొద్ది సంఖ్య లోనే లభ్యమయ్యే అవకాశం లభిస్తుంది. కొద్ది మందికే ఈ కార్డును అందచేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తుంచుకోవాలి.

Leave A Reply

Your email address will not be published.