IPCC(Intergovernmental Panel on Climate Change) got a concern request from Member Countries for the 7th Assessment Report over crucial climate change: పెరుగుతున్న ఉష్ణోగ్రతలా మీద IPCC ని కొత్త రిపోర్ట్ ఇవ్వాలని కోరుతున్న ప్రపంచ దేశాలు.

IPCC(Intergovernmental Panel on Climate Change) ఐపీసీసీ అది రిలీజ్ చేయాల్సిన పర్యావరణ మార్పుల నివేదికను ఇంకా రిలీజ్ చేయలేదు అని మెంబర్ కంట్రీస్ డిమాండ్ చేస్తున్నాయి.

Demand on IPCC(Intergovernmental Panel on Climate Change):
మెంబెర్ లిస్ట్ లో ఉన్న కొన్ని దేశాలు ఐపీసీసీ ని 2028 నాటికి అది విడుదల చేయాల్సిన మరో నివేదికను విడుదల చెయ్యాలని కోరుతున్నాయి. కొత్త రిపోర్ట్ ప్రపంచ దేశాలకు పర్యావరణ మార్పులపై అవగాహన మరియు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యేలా సహాయ పడుతుంది. అనేక ఒప్పందాల తర్వాత కూడా పర్యావరణ మార్పులను అదుపులోకి తీసుకోలేక ఇబ్బంది పడుతూన్న ఈ పరిస్థితి నుండి బయటికి రావడానికి ఒక మార్గం చూపించాలి అని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి.

Sixth assessment report findings –
2002లో రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం గత రెండు మిలియన్ సంవత్సరాలలో కంటే గాలిలో అత్యధిక స్థాయిలో కార్బన్డయాక్సైడ్ నమోదు అయ్యింది. సముద్ర మట్టాలు గత మూడు వేల సంవత్సరాల కంటే వేగంగా పెరుగుతున్నాయి.ఆర్కిటిక్ లోని మంచు అత్యంత వేగంగా కరుగుతోంది. సముద్రం లో ఉండే గ్లేషియర్స్ కూడా గత రెండు వేల సంవత్సరాల కంటే వేగంగా తగ్గిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే శతాబ్దం చివరిలోపు ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల సెంటిగ్రేట్ నుంచి ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది. దేశాలు కాలుష్యాన్ని తగ్గిస్తాం జాగ్రత్తలు పాటిస్తామని ప్రమాణాలు చేసినప్పటికీ జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు.

 

India-related findings in the sixth assessment report:
ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశము కూడా చాలా సమస్యలను ఎదుర్కోబోతుంది సముద్రమట్టాలు పెరగడం, వేడిగాలులు ఎక్కువ అవ్వడం, మరియు తక్కువ పంట దిగుబడి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు మరియు డబ్బు నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. ప్రజలకు దీనిపై అవగాహన కల్పించడం, ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలను ఉదాహరణగా తీసుకొని వారు పర్యావరణం పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలను అలవాటు చేసుకుని మరియు స్థానిక మార్పులు చేయడం వంటి చర్యలను తమ వంతు బాధ్యతగా పాటించాలి. ప్రజలు మరియు పరిశ్రమలు అధిక కాలుష్యానికి దారి తీసే పనులను తగ్గించి తమ వంతు బాధ్యతను నిర్వహించాలి.

Global Stock Take Report:
Global stock report పారిస్ ఒప్పందం ప్రకారం పలు దేశాలు తాము చేసిన ప్రమాణాలకు
పాటిస్తున్నాయా లేదా అని చెక్ చేసే చెక్ అప్ లాంటిది. ప్రపంచంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను గమనిస్తూ అదే విధంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ దేశాలు వారి కాలుష్య నివారణ విధానాలను మిగతా దేశాలతో పంచుకునేలా తోడ్పడుతుంది. ఇటీవల విడుదలైన రిపోర్ట్ లో అనేక దేశాలు పాల్గొన్నాయి. ఊహించిన విధంగా ఉష్ణోగ్రతల పెరుగుదలను తగ్గించగలిగామని, అయితే ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్పారు కొన్ని దేశాలు కాలుష్యం పెరుగుదల మరియు పర్యావరణాన్ని రక్షించడానికి చేసిన ప్రమాణాలను అమలు చేయడంలో విఫలమయ్యాయి అని, వారు కనీసం ప్రయత్నించడం లేదని తెలిపారు. కాలుష్యానికి దారి తీసే హానికర ఇంధనాల వాడకాన్ని నిలిపివేయవలసిందిగా కోరారు. చెట్లను పెంచడం లాంటి కార్యాలను నిర్వహించి, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ని తగ్గించే ప్రయత్నం చేయాల్సిందిగా కోరారు. అలాగే అభివృద్ధి చెందిన దేశాలు చిన్న దేశాలకు సహాయం చేస్తూ, ఈ పొంచి ఉన్న ప్రమాదాన్ని కలిసి ఎదురుకోవాల్సిందిగా కోరారు.

Comments are closed.