Luwak coffee : కప్పు కాఫీ ధర 6వేలు! అందులోని పోషకాలు ఆరోగ్యానికి మేలు,తయారీ చూస్తే బేజారు

అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని అక్టోబర్ -1 న జరుపుకుంటారు. కోల్డ్ కాఫీ, ఐస్ కాఫీ, మిల్క్ కాఫీ ఇలా రకరకాలుగా కాఫీ లను తయారు చేస్తారు. అయితే ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన కాఫీ ఇండోనేషియా లో తయారు చేస్తారు. ఒక కప్పు కాఫీ ధర 6000 రూపాయలు వరకు ఉంటుంది. ఈ కాఫీ పేరు కోపి లువాక్.

అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని (Inter National coffee Day) అక్టోబర్ -1 న జరుపుకుంటారు. ప్రస్తుత రోజుల్లో మానవ జీవితంలో కాఫీ ఒక ముఖ్యమైన భాగంగా మారిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆఫీసులలో పనిచేసేవారు, అలసటగా అనిపించిన వారు కూడా ఒక కప్పు కాఫీ తాగాలి అని అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఎనర్జీ కోసం కూడా కాఫీని తాగుతూ ఉంటారు. కాఫీ లలో వివిధ రకాలు ఉన్నాయి. కోల్డ్ కాఫీ, ఐస్ కాఫీ, మిల్క్ కాఫీ ఇలా రకరకాలుగా కాఫీ లను తయారు చేస్తారు. అందుకే అందరికీ కాఫీ అంటే ఇష్టమైన పానీయం గా మారింది.

ప్రపంచవ్యాప్తంగా కాఫీ ఇష్టపడే వారికి కొదువలేదు. టీ కంటే కాఫీ కొంచెం ఖరీదైనది. సామాన్యులకు 15 రూపాయల లో లభిస్తే ఖరీదైన కేఫ్ (Caffe) లకి వెళ్ళినప్పుడు ఒక కప్పు కాఫీ ధర 500 రూపాయల నుంచి 600 రూపాయలు వరకు ఉంటుంది. అంత ధర చెల్లించి మరీ కాఫీ ని ఇష్టంగా త్రాగే వారు కూడా ఉన్నారు.

Also Read : Coffee Varities: బాప్ రే ఇన్ని ‘ కాఫీ’ లా

Wrapping Food In News Paper : పేపర్ లో చుట్టిన ఆహారం, చేస్తుంది ఆరోగ్యానికి హానికరం

అయితే ప్రపంచం (World) లోనే అత్యంత ఖరీదైన కాఫీ ఇండోనేషియా లో తయారు చేస్తారు. ఒక కప్పు  కాఫీ ధర 6000 రూపాయలు వరకు ఉంటుంది. ఈ కాఫీ పేరు కోపి లువాక్.

ఇంతకీ కాఫీ ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం :

అత్యంత ఖరీదైన ఈ కాఫీ ను పిల్లి మలం (Cat poop) తో తయారు చేస్తారు. ఇది వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇప్పటికీ దీనికోసం వేల రూపాయలను ఖర్చు చేసి మరీ త్రాగుతుంటారు అక్కడి ప్రజలు.ఈ పిల్లి పేరు పామ్ సివెట్. అయితే ఇండోనేషియాలో దీనిని లువాక్ అంటారు.

Luwak coffee: The price of a cup of coffee is 6 thousand! The nutrients in it are good for health, and the preparation is cheap
Image credit : Intrepid Travel

కాఫీ లువాక్ ను ఎలా తయారు చేస్తారు అంటే సాంప్రదాయ (Traditional) పద్ధతిలో తయారుచేస్తారు. కాఫీ గింజలు అనగా బెర్రీలు. వీటిని సివెట్ పిల్లులకు తినిపిస్తారు. తర్వాత పిల్లి మలం నుండి కాఫీ గింజలను వేరు చేస్తారు. వీటిని పూర్తిగా శుభ్రం చేసి ఎండలో ఎండబెట్టి, వేయించి కాఫీ గింజల (Coffee beans) ను తయారు చేస్తారు.

ఈ కోపి లువాక్ కాఫీ ఎందుకు అంత ఖరీదు అంటే?

నిజానికి ఈ కాఫీ ని తయారు చేయాలంటే చాలా సమయం మరియు శ్రమ అవసరం. అలాగే ఈ కాఫీ మిగిలిన కాఫీ కంటే చాలా పోషక విలువలు (Nutritional values) కలిగి ఉంటుంది. సివెట్ క్యాట్ కడుపులో నుంచి కాఫీ గింజలు బయటికి వచ్చినప్పుడు దాని ప్రేగులలో ఉన్న జీర్ణ ఎంజైమ్ (Digestive enzyme) లు కూడా కాఫీ గింజలతో కలిసిపోతాయి. అందుకే ఈ కాఫీ చాలా పోషకమైనది. అందుకే దీని ధర చాలా అధికంగా ఉంది.

Comments are closed.