ఆన్ లైన్ లో స్పైసీ చిప్ ఛాలెంజ్ లో యువకుడి మృతి

స్పైసీ చిప్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో జరిగే ఛాలెంజ్ అత్యంత స్పైసీ పదార్థాన్ని తిన్నతరువాత ఉపశమనం కోసం ఏమీ తినకూడదు, తాగకూడదు

Telugu Mirror: బోస్టన్ మసాచుసెట్స్‌లోని వోర్సెస్టర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు, వైరల్ ఛాలెంజ్‌కి సంబంధించిన అత్యంత స్పైసీ చిప్‌ (Spicy Chip) ని తినడం వల్ల మరణించాడు. ఈ విషయాన్ని NBC బోస్టన్ డాట్ కామ్ నివేదించింది.

హారిస్ వోలోబా (Harris Wolobah) అనే యువకుడు “వన్ చిప్ ఛాలెంజ్” (One Chip Challenge) లో పాల్గొన్న కొద్ది గంటల తర్వాత శుక్రవారం మరణించాడు.

వన్ చిప్ ఛాలెంజ్ అనేది సామాజిక మాధ్యమంలో జరిగే ఛాలెంజ్. ఛాలెంజ్ నియమాల ప్రకారం, ఛాలెంజ్ లో పాల్గొనేవారు ప్రపంచంలోని అత్యంత స్పైసీ టోర్టిల్లా చిప్‌ (Spicy Tortilla Chip) లలో ఒకదానిని తినవలసి ఉంటుంది మరియు వారు స్పైసీ చిప్ తిన్న తరువాత ఏమీ తాగకుండా లేదా స్పైసీ నుండి ఉపశమనం కోసం ఏమీ తినకుండా ఎంతసేపు ఉన్నారు అని నిర్ధారణ చేయడానికి చిత్రీకరిస్తారు.

స్పైసీ చిప్‌ని పాక్వి (Paqui) తయారు చేసింది. దీనిని పిల్లలకు దూరంగా ఉంచాలని మరియు పెద్దలు మాత్రమే తినాలని హెచ్చరికతో కూడిన శవపేటిక బొమ్మ ఉన్న బాక్స్ లో వస్తుంది మరియు స్పైసీ ఫుడ్ తినలేనివారు లేదా అలెర్జీ కారకాలతో బాధపడే వారు తినకూడదు అని కంటైనర్ పై ఉంటుంది. చాలా మసాలా కలిగిన చిప్ తినడం వలన కలిగిన సమస్య వలన హారిస్ మరణించాడని అతని కుటుంబ సభ్యులను పేర్కొంటూ నివేదిక ఉటంకించింది.

వోర్సెస్టర్ స్కూల్ కమ్యూనిటీ డోహెర్టీ మెమోరియల్ హైస్కూల్‌ (Doherty Memorial High School) లో రెండవ సంవత్సరం చదువుతున్న హారిస్‌కు సంతాపం తెలియజేస్తూ వోర్సెస్టర్ పబ్లిక్ స్కూల్స్ (Worcester Public Schools) సూపరింటెండెంట్ రాచెల్ మొనారెజ్ (Rachel Monarrez) ప్రకటనను తెలియ పరుస్తూ  NBCBoston నివేదిక తెలిపింది.

Teen dies in online spicy chip challenge
image credit: Tiktok

Also Read: ఆగిన ఇస్రో గొంతుక చంద్రయాన్ -3 చివరి కౌంట్ డౌన్

వన్ చిప్ ఛాలెంజ్ కోసం పాక్వి వెబ్ పేజీ ని అనుసరించి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు. మూర్ఛలు లేదా వికారం ఎక్కువగా ఉన్న ఎవరైనా వైద్య సహాయం తీసుకోవాలి.

“క్లాస్‌మేట్ ఒకతను చిప్ ఇచ్చాడని ఆమె కొడుకు చెప్పాడని, అతనికి కడుపు నొప్పి వచ్చింది అని శుక్రవారం తనను ఒక నర్స్ పాఠశాలకు పిలిచింది.” అని హారిస్ తల్లి, లోయిస్ వలోబా NBC10 బోస్టన్ తో మాట్లాడుతూ తెలిపింది. తల్లి తో కలసి ఇంటికి వెళ్లిన తర్వాత హారిస్‌కు కడుపు నొప్పి నుంచి ఉపశమనం మంచి కలిగింది, అయితే అతను బాస్కెట్‌బాల్ ట్రయౌట్‌ల కోసం బయలుదేరబోతుండగా, హారిస్ అస్వస్థతకు గురయ్యాడని, ఆమె చెప్పింది.

దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదని, శవపరీక్ష నివేదిక వచ్చిన తరువాత ఆతని మృతికి గల కారణాలు తెలుస్తాయి. యువకుడి మృతిపై వోర్సెస్టర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.