ప్రపంచంలో ఎనిమిదవ ఖండం అవతరించనుందా? దాని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం

చదువుకునే రోజుల్లో ప్రపంచంలో ఏడు ఖండాలు ఉన్నాయని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎనిమిది ఖండాలు అని చెప్పాల్సి వస్తుంది. దాని గురించి పూర్తి వివరణ ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Mirror : మన భూమిపై ఉండే సముద్రాలు, మహాసముద్రాలు మరియు ఖండాలు భౌగోళిక చక్రంలో భాగంగా ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ఉంటాయి. చదువుకునే రోజుల్లో టీచర్స్  భూమిపై ఎన్ని ఖండాలు ఉన్నాయ్ అని ప్రశ్న వేస్తే ఎటువంటి సందేహం లేకుండా ఏడు ఖండాలు అని చెప్పేస్తాం. అయితే ఇకపై ఇప్పుడు ఎనిమిది ఖండాలు ఉన్నాయని చెప్పాల్సి వస్తుంది. అవును అండీ మీరు విన్నది నిజమే. ఇది ఇప్పటిది కాదు దాదాపు 375 సంవత్సరాల క్రితం భూ విజ్ఞాన మరియు భూ శాస్త్రవేత్తలు తాజాగా కొత్త మ్యాప్ ని రూపొందించి, దాని గురించి Phys.org నివేదన అందించింది.

అయితే ఈ కొత్త ఖండానికి జిలాండియా (Zealandia) లేదా టె రియు-ఎ-మౌయి (Te Riu-a-Maui) అనే పేరుతో పిలుస్తున్నారు. బీబీసీ (BBC) వాళ్ళు వెల్లడించిన దాని ప్రకారం, మడగాస్కర్ కంటే సుమారు 6 రేట్లు ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని చెప్పారు. అంటే, జిలాండియా 4.9 మిలియన్ చదరపు కి.మీల విస్తీర్ణంలో ఉంది. ఇప్పుడు ఈ చిన్న మరియు సన్ననైనా ఖండం ఎనిమిదవ ఖండంగా రూపాంతరం చెందింది. కాబట్టి ఇప్పుడు ఎనిమిది ఖండాలు (8 Continents) ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Image Credit : India Today

ఇండియన్ కోస్ట్ గార్డు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే

జిలాండియా సుమారు 94 శాతం నీటి అడుగున ఉందని, న్యూజిలాండ్ (New Zealand) యొక్క దేశం లాగానే కొన్ని ద్వీపాలు ఉన్నాయని న్యూజిలాండ్ క్రౌన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ GNS సైన్స్‌లోని జియాలజిస్ట్ ఆండీ తుల్లోచ్ చెబుతూ చెప్పారు. ఆయన మాట్లాడుతూ, ఈ ఖండాన్ని వెలితీసేందుకు సమయం పడుతుందని మరియు దీన్ని అధ్యయనం చేయడం చాల కష్టం తో కూడిన పని అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు సముద్రపు అడుగున ఉండే అవక్షేపాలను మరియు రాళ్ల నమూనాలను సేకరించి వాటిపై అధ్యయనాలు చేస్తున్నారు అయితే డ్రిల్లింగ్ సైట్స్ నుండి కొన్ని రాగా మరి కొన్ని ఆ సముద్ర లేదా ద్వీప తీర ప్రాంతాల నుండి వచ్చాయని వెల్లడించారు.

ఈ ఖండం చుట్టూ న్యూజిలాండ్ మాత్రమే కాదు దీనితో పాటు లార్డ్ హై కి చెందిన న్యూ కాలెడోనియా మరియు బాలిస్ పిరమిడ్ లాంటి మరికొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియా (Australia) యొక్క కొన్ని భూభాగాలు మరియు ద్వీపాలు ఈ ఖండానికి చుట్టూర ఉన్నాయి. ఈ రాళ్ళ నమూనాలను పరిశోధిస్తే అవి అంటార్కిటిక యొక్క పశ్చిమ భాగంలో ఉండే భూభాగ నమూనాలను చూపిస్తున్నాయి. న్యూజిలాండ్ పశ్చిమ తీరంలో క్యాంబెల్ అని పిలువబడే ఒక పీఠభూమికి (the plateau) దగ్గర్లో ఉండే సబ్డక్షన్ (Subduction) ప్రాంతం వద్ద సూచిస్తుంది.

దాదాపు 80 ఏళ్ల క్రితం మనం పిలుచుకున్న అతి పెద్ద ఖండం పేరు గోండ్వానా (Gondwana). ఈ గోండ్వానా ఖండంలో ఒక భాగమే ఈ జిలాండియా అని చెబుతున్నారు. కొన్ని వందల సంవత్సరాలు లేదా సుమారు 550 ఏళ్ల క్రితమే ఇది ఏర్పడింది ఇంకా దక్షిణాన ఉన్న భూమిని మొత్తం కలిపి ఉంది.

Comments are closed.