Google 25th Birth Day : నేడు సెర్చ్ ఇంజన్ గూగుల్ 25వ పుట్టిన రోజు

సెర్చింగ్ దిగ్గజం గూగుల్ ఈ రోజు తన 25 వ పుట్టినరోజుని జరుపుకుంటుంది. గూగుల్ యొక్క 25 సంవత్సరాల కృషి, పట్టుదల వలననే ఇది సాధ్యమయింది. అలాగే ఈ రోజు గూగుల్ యొక్క ప్రస్థానాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాము.

గూగుల్ పుట్టినరోజు:

సెర్చింగ్ దిగ్గజం గూగుల్ ఈ రోజు తన 25 వ పుట్టినరోజుని జరుపుకుంటుంది. ఉన్నత స్థాయికి చేరాలంటే ఏళ్ల తరబడి కష్టపడాలనే విషయం అందరికీ తెలిసిందే. తెలిసిన విషయమే అయినా అందరూ ఆ స్థాయికి చేరుకోలెరు. శోధన (search) దిగ్గజం గూగుల్ ఈ విషయంలో విజయాన్ని సాధించగలిగింది. ఈ రోజు సెప్టెంబర్ 27న గూగుల్ తన 25వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. ఈ ప్రత్యేకమైన (Unique) క్షణాలను ఇంకా గొప్పగా సెలబ్రేట్ చేయాలని భావించి కంపెనీ తన జన్మదిన వార్షికోత్సవానికి డూడుల్ గా పేరు పెట్టింది.

గూగుల్ యొక్క 25 సంవత్సరాల కృషి, పట్టుదల వలననే ఇది సాధ్యమయింది. అలాగే ఈ రోజు గూగుల్ యొక్క ప్రస్థానాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాము.

తన 25 వ పుట్టిన రోజు సందర్భంగా గూగుల్ తన వినియోగదారులకు ధన్యవాదాలు తెలియజెప్పింది.
ఇది ప్రారంభం
1995 లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ డార్మిటరీలో లారీ పేజ్ (larry Page) మరియు సెర్గీ బ్రిన్ (Sergey Brin) స్టాన్‌ఫోర్డ్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలో ప్రపంచ వ్యాప్తంగా వెబ్ ను సరళీకృతం చేయాలనుకునే వ్యక్తులను కలిశారు. ఇద్దరూ సెర్చ్ ఇంజిన్ యొక్క మోడల్ పై పని చేయడం ప్రారంభించారు. Google Inc1998లో వాస్తవ రూపంలోకి వచ్చింది. ఈ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించే ముందు, ఇద్దరూ దీనికి బ్యాక్‌రబ్ (Back Rub) అని పేరు పెట్టారు, అది తరువాత గూగుల్‌గా మార్చబడింది.

Also read : Success Story: భార్య మాట విన్న భర్త.. ప్రతి రోజూ రూ.5 కోట్ల సంపాదన.. షాకింగ్ స్టోరీ..

Google Pay: నయా ఫీచర్ UPI లైట్ తో ఇక పై పిన్ అవసరం లేకుండనే చెల్లింపులు..

25 ఏళ్లలో విజయ శిఖరం

చిన్నపాటి గ్యారేజీ నుంచి మొదలై ఆ తర్వాత రోజురోజుకు ఎన్నో మార్పులు చేస్తూ గూగుల్‌ని అత్యుత్తమ సెర్చ్ ఇంజన్‌గా రూపొందించేందుకు అను నిత్యం నిరంతరం కృషి చేశారు. 25 సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణంలో, Google ఎన్నోసార్లు చిన్న మరియు పెద్ద మార్పులను చూసింది. నేడు ఇది ప్రపంచంలోని అగ్ర టెక్ కంపెనీలలో ఒకటిగా లెక్కించబడుతుంది.  ఒకే క్లిక్‌లో కోరుకున్న ఏ సమాచారాన్నైనా అందించే ఈ సెర్చ్ ఇంజన్ నేడు ప్రపంచ వ్యాపితంగా ప్రజల జీవితంలో అత్యంత ముఖ్యమైన మరియు ఉపయోగకరమైన భాగంగా మారింది.

గూగుల్ 25 వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ CEO సుందర్ పిచాయ్ (Sundar Pichai) ‘X’ లో ఇలా వ్రాశారు. ” 25 వ పుట్టినరోజు శుభాకాంక్షలు @Google! 🎂 మా ప్రొడక్ట్ లను వినియోగించే వారందరకీ మేము కొత్త ఆవిష్కరణలు చేయడానికి మాకు సవాలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ మరియు గూగ్లర్స్ అందరికీ ధన్యవాదాలు!”

గత 25 సంవత్సరాలలో గూగుల్ లోగో పరిణామాన్ని తెలిపే డూడుల్ ను కూడా సుందర్ పిచాయ్ షేర్ చేశాడు.

Comments are closed.