YSR Cheyutha list 2024 : మహిళలకు గుడ్ న్యూస్, వైఎస్ఆర్ చేయూత 3వ దశ ఎప్పుడంటే?

2024 నవంబర్ 15న(అంచనా) ఈ పథకాన్ని అందిస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో 3వ జాబితాలో తమ పేరును అధికారిక వెబ్సైటులో చెక్ చేసుకోవాలి.

YSR Cheyutha list 2024 : ఏపీలోని మహిళలందరికీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ఆర్ చేయూత 2024 జాబితాను ప్రకటించనుంది. ఇప్పటికే 2 జాబితాలను విడుదల చేసిన ప్రభుత్వం 3వ జాబితా విడుదల తేదీని కూడా ప్రకటించింది. 2024 నవంబర్ 15న(అంచనా) ఈ పథకాన్ని అందిస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో 3వ జాబితాలో తమ పేరును చెక్ చేసుకోవాలనుకునే దరఖాస్తుదారులు, అధికారిక వెబ్‌సైట్‌ https://gramwardsachivalayam.ap.gov.in/ ని సందర్శించడం ద్వారా వారి దరఖాస్తు స్థితిని తనిఖీ చేయవచ్చు మరియు పూర్తి  వివరాలు తెలుసుకోవచ్చు.

ysr-cheyutha-2024-good-news-for-women-when-is-the-3rd-phase-of-ysr-cheyutha

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయం అందించడం కోసం సీఎం జగన్ 2020 ఆగస్టు 12న వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి, రెండో విడతల్లో 2.72 లక్షల మంది లబ్ధిదారులకు సుమారు రూ. 500 కోట్లు ఇచ్చారు. తాజాగా 3వ విడుత కోసం ప్రభుత్వం మొత్తం రూ.17,000 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేసింది. 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలందరూ ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 26,39,703 మంది మహిళలు లబ్ధి పొందుతారని అంచానా.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలో గెలుపు కోసం సంక్షేమ పథకాలను భారీగా ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. అభివృద్దికి ప్రాధాన్యత తగ్గించైనా సంక్షేమం అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజల మద్దతు కూడగట్టాలనే ఆలోచనలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. ప్రధానంగా మహిళలకు ఇసారి ఇంకా కొన్ని ప్రత్యేక హామీలు ఇవ్వనున్నారు. అంతేకాకుండా మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత గ్యాస్, వృద్దాప్యం పింఛన్ల పెంపు, రైతు సాయం పెంపు, అమ్మవడి పెంపు వంటి హామీలివ్వటానికి ప్రధాన పార్టీలు రెడీ అయ్యాయి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ పార్టీలు ఎలాంటి హామీలిస్తాయో చూడాలి. ప్రజలకు మరింత సంక్షేమం అందుబాటులోకి రానున్నది మాత్రం వాస్తవం.

Comments are closed.