Human Interest

వానా కాలం కుండీలలో ఉన్న మొక్కలకు తీసుకోవలసిన  జాగ్రత్తలు.

Telugu Mirror : వర్షాలు పడుతున్నాయి. మొక్కలకు వర్షాకాలం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే తేమ మరియు నీరు అధికం కావడం వలన వాటికి హాని కలిగే అవకాశం ఉంటుంది .ఈ విధంగా జరిగితే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. వర్షాకాలంలో కుండీలలో నీరు అధికంగా ఉండటం వల్ల తేమ ఎక్కువ అవుతుంది. దీనివల్ల మొక్కలు చనిపోతాయి. కాబట్టి వర్షాకాలంలో కుండీలలో మొక్కలకు నీరు పోసే ముందు ఏ మొక్కకు ఎంత నీరు అవసరమో తెలుసుకోవాలి. అలాగే మొక్కకి ఏ విధంగా నీరు ఇవ్వాలో, ఎటువంటి నియమాలు పాటించాలో తప్పకుండా తెలియాలి. కొంతమందికి కుండీలలో మొక్కలు ఎలా పెంచాలో తెలియదు. మొక్కలు కొని కుండీలలో వేస్తారు కానీ తర్వాత వాటి సంరక్షణ మరియు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం తెలియదు. అటువంటి వారి కోసం ఇవాళ మీకు మేము కొన్ని విషయాలను తెలియజేస్తున్నాం.

Also Read : కెరాటిన్ ట్రీట్మెంట్ తో మెరిసే జుట్టు మీ సొంతం,మధ్యతరగతి మహిళలకు డబ్బు సమయం ఆదా ఇలా

1 . కుండీలలో పెంచే మొక్కలు కైనా లేదా గార్డెన్లో పెంచే మొక్కలు కైనా నీరు అవసరం.
2. వర్షపు నీరు మొక్కలకు ఉపయోగకరమే కానీ కుండీలలో పెంచే మొక్కలకు నీరు అధికమైతే మొక్కల కుళ్ళిపోతాయి. తద్వారా మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది.
3. కుండీలోని పైన ఉన్న మట్టిని చెక్ చేస్తే తెలిసిపోతుంది తేమ ఎక్కువగా ఉందా లేదా అనే విషయం. దీనిని బట్టి మొక్క పట్ల జాగ్రత్త తీసుకోవాలి.
4.వర్షాకాలంలో కుండీలలో ఉన్న మొక్కలకు నీరు ఎక్కువై నీరు నిలిచినప్పుడు ఆ నీటిని బయటకు తీసేయాలి.
5. కుండీలోని మొక్కలకు నీరు పోసే ముందు మట్టి తేమను చెక్ చేయాలి. తేమ ఉంటే మొక్కకు నీరు పోయనవసరం లేదు. మట్టి పొడిగా ఉంటే మాత్రమే నీరు పోయాలి.
6. మొక్కలకు ఉదయం సమయంలో నీరు పోయడం శ్రేయస్కరం. అప్పుడు మొక్కలు పచ్చగా మరియు ఆరోగ్యంగా ఉంటాయి. ఉదయం పూట మొక్కలకు నీరు పోయడం వల్ల మట్టి నీటిని పీల్చుకోవడానికి మరియు తేమను నియంత్రించడానికి సమయం లభిస్తుంది.తద్వారా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.
7. నిరంతరాయంగా వర్షం పడుతుంటే వారం లేదా రెండు వారాలు పాటు మొక్కలకు నీరు పోయడం అవసరం లేదు. కానీ వర్షం తక్కువగా ఉంటే మట్టిని చెక్ చేసి మొక్కలకు నీటిని అందించాలి.

image credit : tv9 telugu

8. వర్షాకాలంలో మొక్కల ఆకులు మెత్తగా ఉండి, లేత పసుపు రంగులో కనిపిస్తే కుండీలో నీరు అధికంగా ఉందని అర్థం. అటువంటి సందర్భంలో మొక్కలకు నీరు పోయడం ఆపివేయాలి.
9. మొక్కలు ఎండిపోతున్నా మరియు వాటి ఆకులు రంగు మారి ఎక్కువగా రాలిపోతున్న అటువంటి సమయంలో మొక్కలకు నీరు చాలా అవసరమని గుర్తించాలి.
10. తేలికపాటి జల్లులు ఉన్నప్పుడు మట్టి పైన తడిగా ఉంటుంది. కానీ అడుగున పొడిగా ఉంటుంది .కాబట్టి కుండీలో మట్టిని చెక్ చేస్తూ ఉండాలి. ఒకటి లేదా రెండు అంగుళాల వరకు వేలిని మట్టి లోపలికి పెట్టి తనిఖీ చేయడం ద్వారా నీరు అవసరమా లేదా అనే విషయం అర్థం అవుతుంది.
11.కుండీలో మొక్కలకు తేమ ఉంటే నీరు ఇవ్వకండి. పొడిగా ఉంటే మాత్రమే నీరు పోయాలి.
12.ఒక కుండీలో రెండు మరియు మూడు రకాల మొక్కలు పెంచినట్లయితే వాటికి నీరు అధికంగా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే నీరు సరిపోకపోతే మొక్కలు వడలిపోవడం, ఆకులు రంగు మారడం మరియు ఆకులు వంకరగా అవ్వడం జరుగుతుంటాయి. అటువంటి పరిస్థితులలో మొక్కలకు నీటి కొరత ఉందని అర్థం.కాబట్టి కుండీలో పెంచే మొక్కలకు నీరు పోసే ముందు ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి.

Also Read : రెడ్ వైన్ తో మీ ఆయుష్షును పెంచండి, ఎన్నో లాభాలను పొందండి

Telugu Mirror

Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in

Recent Posts

ವಿಕ್ರಂ ಗೌಡ ನಕ್ಸಲ್ ನಿಗ್ರಹ ಪಡೆ ಪೊಲೀಸರ ಬಲೆಗೆ ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಬಿದ್ದಿದ್ಹೇಗೆ

ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್​ಎಫ್​ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್​​ಕೌಂಟರ್​…

1 month ago

make sure working

ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್​, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್‌ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…

1 month ago

Aadhaar Update : ఆధార్ కార్డు నవీకరణకు మరో అవకాశం.. ఏపీలో ప్రత్యేక డ్రైవ్.. ఎప్పటి నుంచి అంటే?

[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…

5 months ago

Microsoft Windows crashes : మైక్రోసాప్ట్ విండోస్ క్రాష్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు.

[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…

5 months ago

Samsung Galaxy M35 5G : శాంసంగ్ నుంచి క్రేజీ డీల్.. తక్కువ ధరలో సూపర్‌ ఫీచర్స్‌.

Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…

5 months ago

Honor 200 5G Series : అదరగొట్టిన హానర్.. టెలిఫొటో కెమెరాలతో హానర్ 200 5జీ సిరీస్.. ధర ఎంతో తెలుసా?

Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…

5 months ago