DC vs KKR : ఓరినాయనో బ్యాటుతో రెచ్చిపోయిన విండీస్ స్పిన్నర్.. ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం..!

ఢిల్లీ క్యాపిటల్స్ పై పరుగుల వరద పారించిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ 106 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయాలతో కేకేఆర్ జోరు కొనసాగిస్తోంది

DC Vs KKR : విశాఖలో పరుగుల వరద పారింది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) బౌలర్ల పై కోల్‌కత్తా బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఇక సునీల్‌ నరైన్‌ (Sunil Narine) బ్యాట్‌తో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. కోల్‌కత్తా బ్యాటింగ్‌తో మంచి ప్రదర్శన చేయడంతో  ఐపీఎల్‌ చరిత్రలో (History of IPL) రెండో అతిపెద్ద స్కోర్‌ చేసిన టీమ్ గా కోల్‌కత్తా నమోదైంది.

మొదటగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్(KKR) భారీ స్కోరు చేసింది. తొలి బంతి నుంచి ఆ జట్టు బ్యాటర్లు ఎదురుదాడికి దిగడంతో ఐపీఎల్ (IPL) చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు (272) నమోదు చేసింది. ఇటీవల ముంబైపై సన్ రైజర్స్ నమోదు చేసిన 277 పరుగులకు 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సునీల్ నరైన్ 85 పరుగులతో సత్తాచాటాడు. రఘువంశీ 54 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ఏకంగా నలుగురు బౌలర్లు 40 రన్స్‌కి పైగా సమర్పించుకున్నారు.

భారీ లక్ష్యం ఛేదించడంలో ఢిల్లీ క్యాపిటల్‌ సొంత మైదానంలో పరాజయం పాలైంది. 106 పరుగుల తేడాతో ఢిల్లీని కోల్‌కత్తా చిత్తుచేసింది. లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.2 ఓవర్లలో 166 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. కెప్టెన్ రిషభ్ పంత్(25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), ట్రిస్టన్ స్టబ్స్(32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

DC vs KKR

సన్‌రైజర్స్ హైదరాబాద్ 272 పరుగుల రికార్డ్ స్కోర్‌కు 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బుల్లెట్ యార్కర్‌తో ఇషాంత్ శర్మ రస్సెల్‌ను ఔట్ చేసి సన్‌రైజర్స్ రికార్డ్‌ను కాపాడాడు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోకియా మూడు వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ చెరొక వికెట్ తీసారు.

సునీల్ నరైన్(39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. సునామీ ఇన్నింగ్స్‌తో పవర్ ప్లేలోనే మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కేకేఆర్‌ ఈ మ్యాచ్‌తో వరుసగా హ్యాట్రిక్‌ విజయాలను సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో మొదటి స్థానం చేరుకోగా, మూడో ఓటమితో ఢిల్లీ కింద నుంచి రెండో స్థానానికి చేరింది.

DC vs KKR

Comments are closed.