DCW vs MIW: జెమిమా రోడ్రిగ్స్ తుఫాను ఇన్నింగ్స్, ప్రతీకారం తీర్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.

ఢిల్లీ క్యాపిటల్స్ 29 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

Telugu Mirror : ఢిల్లీ క్యాపిటల్స్ 29 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను (Mumbai Indians) ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. WPL 2024లో ఇది వారికి వరుసగా నాలుగో విజయం. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఛేజింగ్‌ చేసే ప్రయత్నంలో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ (Meg Lanning) టాస్ ఓడిపోయి మొదటిగా బ్యాటింగ్ కు వచ్చారు.

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్ మెగ్ లానింగ్ మరియు స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్‌ లు ఆకట్టుకునే అర్ధశతకాలు బాదడంతో ఆతిథ్య జట్టు ముంబై ఇండియన్స్‌ను 192 పరుగుల భారీ తేడాతో ఓడించింది. 193 పరుగుల ఛేజింగ్‌లో ముంబై మొదటి లోనే తడబడింది అమంజోత్ కౌర్ 27 బంతుల్లో 42, హేలీ మాథ్యూస్ 17కి 29 పరుగులు చేసినప్పటికీ, మిగతా బ్యాట్స్ మెన్స్ 8 వికెట్ల నష్టానికి 163 పరుగుల వద్ద ముగించారు.

Also Read : Swiggy tie up with IRCTC : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్, స్విగ్గి IRCTCతో ఒప్పందం, ఇక ఆ సేవలు కూడా!

ఈ సీజన్ లో ఆడిన ఐదు గేమ్‌లలో ఇది ముంబై ఇండియన్స్ కు రెండో ఓటమి, WPL చరిత్రలో ఇది రెండోసారి. వారు DC చేతిలో ఓడిపోయారు. దీంతో ఢిల్లీకి వరుసగా నాలుగు విజయాలు దక్కాయి. ఐదు మ్యాచ్‌లలో  ఎనిమిది పాయింట్లు సాధించిన ముంబై కంటే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) రెండు పాయింట్లు ఆధిక్యంలో ఉంది. DC విజయంతో అగ్రస్థానంలో కొనసాగుతుంది, ఇది ఆతిథ్య జట్టుకు శుభవార్త అవుతుంది అనే చెప్పాలి.

Delhi Capitals beat Mumbai Indians by 29 runs to top the points table.

ఈ సీజన్ ఈవెంట్ యొక్క మొదటి గేమ్‌లో చివరి బంతికి MI చేతిలో ఓడిపోయింది, ఇది చాలా వరకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం ను నిరాశపరిచింది. యాస్టికా భాటియా (6), హర్మన్‌ప్రీత్ కౌర్ (6)లకు రెండు వికెట్లు లభించాయి. ఓపెనర్ మాథ్యూస్ 17 బంతుల్లో 29 పరుగులు చేసి ఎడమచేతి వాటం స్పిన్నర్ జెస్ జోనాసెన్ (3/21) బౌలింగ్‌లో ఆలిస్ క్యాప్సీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. తొమ్మిదో ఓవర్‌లో, 19 ఏళ్ల పేసర్ టైటాస్ సాధు అమేలియా కెర్ (17)ను అవుట్ చేసింది.

Also Read : Credit card new rules : క్రెడిట్ కార్డుల్లో కొత్త నియమాలు, ఈ బ్యాంకుల్లో మార్పులు

జెమిమా రోడ్రిగ్స్ తుఫాను ఇన్నింగ్స్..

అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ 13వ ఓవర్ చివరి బంతికి అమేలియా కెర్ చేతికి చిక్కింది. 38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసింది. 151 పరుగుల వద్ద సైకా ఇషాక్ బౌలింగ్‌లో మారిజానే కాప్‌ను వెనుదిరిగింది. కాప్ 12 బంతుల్లో 11 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్ (Jemima Rodrigues) 33 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, జెస్ జోనాసెన్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ముంబై ఇండియన్స్ తరపున షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్, హేలీ మాథ్యూస్ తలో వికెట్ తీశారు

Comments are closed.