Rishabh Pant Fine : రిషబ్ పంత్‌కి జరిమానా.. రిపీట్ చేస్తే డబుల్.

ఐపీఎల్ 2024లో తొలి విజయం సాధించిన జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన రిషబ్ పంత్‌కు భారీగా జరిమానా పడింది.

Rishabh Pant Fine : ఐపీఎల్ 2024 లో తొలి విజయంపై ఆశలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్‌కు (Rishabh Pant) పెనాల్టీ పడింది. విశాఖపట్నం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్‌కు ఐపీఎల్ నియంత్రణ మండలి రూ.12 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్‌లో మినిమమ్ ఓవర్ రేట్‌కు సంబంధించి ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) జట్టు మొదటిసారి ఉల్లంఘించినందుకు పంత్‌కి ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూ. 12 లక్షల జరిమానా విధించింది.

కాగా, ఈ సీజన్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా పెనాల్టీ గురైన రెండో కెప్టెన్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. అంతకుముందు, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ (Slow overrate) కారణంగా గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా పడింది.రెండో సారి స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడితే? అప్పుడు కెప్టెన్ రిషబ్ పంత్‌కి జరిమానా రెట్టింపు, అంటే రూ.24 లక్షలు కానుంది.

Rishabh Pant Fine

అలానే తుది జట్టులోని మిగిలిన 10 మంది ప్లేయర్లకి రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% కోత పడనుంది. ఒకవేళ మూడోసారి కూడా స్లో ఓవర్ రేట్ తప్పిదానికి టీమ్ పాల్పడితే, కెప్టెన్‌కి మ్యాచ్ ఫీజులో 30% కోత.. అలానే ఒక మ్యాచ్‌పై నిషేధం పడనుంది. ఇక మిగిలిన 10 మంది ప్లేయర్లకి రూ.12 లక్షల చొప్పున జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50% కోత పడనుంది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నైసూపర్ కింగ్స్‌పై 20 పరుగుల తేడాతో గెలిచింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే తొలి విజయం కావడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్(51), ఓపెనర్ డేవిడ్ వార్నర్(52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

పృథ్వీ షా(43) కూడా రాణించాడు. అనంతరం భారీ లక్ష్య చేధనలో చెన్నై చతికిలపడింది. మొత్తం ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. చివర్లో ధోని మెరుపులు మెరిపించిన ఫలితం లేకపోయింది. చెన్నై జట్టులో రహానే(45), డారిల్ మిచెల్(34), ధోని(37) రాణించారు

Rishabh Pant Fine

Comments are closed.