SRH vs LSG : మాటల్లేవ్. 166 టార్గెట్‌ 9.4 ఓవర్లలో ఉఫ్.. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ బెర్తు పదిలం.

ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు ఏడో విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై లక్నో సూపర్‌ జెయింట్స్‌ను పది వికెట్లు తేడాతో చిత్తుగా ఓడించింది.

SRH vs LSG : కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (sun risers hyderabad) అద్భుత ప్రదర్శన చేసింది. ఉప్పల్ స్టేడియం (uppal stadium) లో హైదరాబాద్ ఓపెనర్లు బ్యాట్‌తో విధ్వంశం చేసారు. 166 పరుగుల లక్ష్యం కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కి వెళ్లేందుకు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇటీవలి మ్యాచుల్లో రాణించలేకపోయిన ఓపెనర్లు, లక్నో సూపర్ జెయింట్ తో హోమ్ గ్రౌండ్స్ లో జరిగిన మ్యాచ్ లో బౌలర్లకు చుక్కలు చూపించారు. లక్నో 166 పరుగుల స్కోరును సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది.ప్లేఆఫ్‌లకు చేరువైంది. ట్రావిస్‌ హెడ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Gaints) 90\ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కేఎల్ రాహుల్. సన్‌రైజర్స్ విధ్వంసం ముందు తమ జట్టు తేలిపోయిందని తెలిపాడు.

Also Read : DC vs RR, IPL 2024 : సంజూ శాంసన్ పోరాటం వృథా.. ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు సజీవం.

166 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఓపెనర్లు తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగారు. అదే పిచ్‌పై సన్ రైజర్స్ ఫోర్లు, సిక్సర్లు బాదిన సమయంలో లక్నో బ్యాట్స్‌మెన్ (Lucknow Bats Man) స్కోరు చేయడంలో విఫలమయ్యారు. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ తమ జోరును కొనసాగించారు. విజయాన్ని ఖాయం చేసేందుకు పవర్ ప్లే ముగిసే సమయానికి 107/0 స్కోర్ చేసారు. ఈ మ్యాచ్‌లో లక్నో పవర్ ప్లే ముగిసే సమయానికి 27/2 స్కోరు చేయడం గమనార్హం.

ఆ తర్వాత అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తమ జోరును కొనసాగించి అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. హెడ్ 16 బంతుల్లో 50 పరుగులు చేయగా, అభిషేక్ 19 బంతుల్లోనే చేశాడు. ఈ కలయిక ఇన్నింగ్స్ అంతటా తమ వేగాన్ని కొనసాగించింది, పది ఓవర్లు కూడా పూర్తి కాకుండానే మ్యాచ్‌ను ముగించింది. SRH 9.4 ఓవర్లలో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 89 పరుగులు), అభిషేక్ శర్మ (28 బంతుల్లో 75 పరుగులు) అజేయంగా నిలిచారు.

Comments are closed.