Gold And Silver Rates Today 09-04-2024: దేశంలో స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్లు..హైదారాబాద్ లో కేజీ వెండి 88 వేలు, బంగారం ధర వచ్చేసి..

Gold And Silver Rates Today 09-04-2024: దేశంలో సోమవారం తో పోల్చుకుంటే బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. కానీ వాటి ఆల్ టైమ్ - హై లోనే పసిడి ధరలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా గోల్డ్ రేట్లు హెచ్చుతగ్గులు లేకుండా అన్ని చోట్లా ఒకేలా కొనసాగుతున్నాయి.

Gold And Silver Rates Today 09-04-2024: దేశంలో మంగళ వారం రోజు బంగారం ధరలు సోమవారం రేట్ల మీద స్వల్పంగా పెరిగాయి. దేశంలో 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.10 పెరిగి, రూ. 65,660 వద్దకు చేరింది. నిన్నటి రోజు ఈ ధర రూ. 65,650గా ఉంది. ఇక 100 గ్రాముల 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.100 పైకి వెళ్ళి రూ. 6,56,600గా నమోదయింది. ప్రస్తుతం 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,566గా ఉంది.

ఇదిలావుండగా 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.10 పెరిగి రూ. 71,630 వద్ద కొనసాగుతోంది. సోమవారం రోజు ఇదే 24 క్యారట్ల బంగారం ధర రూ. 71,620గా ఉన్నది. మరోవైపు 24 క్యారట్ల గోల్డ్ 100 గ్రాముల ధర రూ. 100 వృద్ది చెంది రూ. 7,16,300గా కొనసాగుతోంది.

Gold Rate Today In Telugu States :

హైదరాబాద్​లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,660గా పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 71,630గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లు గోల్డ్ రేటు రూ.65,660. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.71,630గాకొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.65,660 మరియు 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.71,630గా నమోదయ్యాయి.

ఇక దేశంలోని ముఖ్య నగరాలలో పసిడి ధరలు మంగళ వారం రోజున స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 65,810గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,780గా నమోదు అయింది. కోల్​కతాలో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 65,660గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 71,630గా పలుకుతోంది. ముంబై, బెంగళూరు, కేరళలో కూడా బంగారం రేట్లు ఇవే కొనసాగుతున్నాయి.

Gold and Silver Rates Today 09-04-2024
Image Credit : Telugu Mirror

మరో వైపు చెన్నైలో 22క్యారెట్ల పుత్తడి ధర వచ్చేసి రూ. 66,610గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,660గా పలుకుతోంది. ఇక పూణే విషయానికి వస్తే 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ. 65,660గా పలికింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,630గా కొనసాగుతుంది.

అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 65,710గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71,680గా పలుకుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,660గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు వచ్చేసి రూ. 71,680గా కొనసాగుతున్నది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు మరియు తగ్గడానికి కారణమవుతున్నాయని విపణి మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Silver Price Today:

దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా దిగివచ్చాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి రేటు రూ. 8,460గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 84,600గా నమోదయింది. ఆదివారం కిలో వెండి రేటు రూ 84,500గా ఉంది.

Today Silver Rate In Hyaderabad:

హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.88,100 పలుకుతోంది. మరోపక్క కోల్ కతాలో కేజీ వెండి ధర 84,600 అలాగే బెంగళూరులో కేజీ వెండి ధర 82,900గా ఉంది.

Gold Rates Today 09-04-2024

Comments are closed.