ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి లైఫ్ బిజీ (Busy Life) గా మారిపోయింది. మానసిక ఆందోళన మరియు ఒత్తిడి (Stress) కారణంగా శృంగార సామర్థ్యం (Sex Drive) మరియు లైంగిక కోరికలు (Sexual Desires) తగ్గి పోతున్నాయి అని కొన్ని అధ్యయనాలలో తేలింది. తల్లిదండ్రులు అవ్వాలని అనుకునే వారికి ఇది ఒక సమస్యగా మారింది.
అయితే ఇటువంటి సమస్యల నుండి బయటపడడానికి పోషకాహారం పై శ్రద్ధ (Care) పెట్టడం వలన ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజువారి ఆహారంలో భాగంగా తాజా కూరగాయలు (Vegetables) మరియు పండ్ల (Fruits) ను కూడా తీసుకోవడం వల్ల లైంగిక శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంటుంది.
లైంగిక శక్తి, సామర్థ్యాలను పెంచే పండ్లు మరియు కూరగాయలు ఏమిటో తెలుసుకుందాం.
దానిమ్మ పండు:
దానిమ్మ (Pomegranate)పండు పోషక విలువలు మరియు లైంగిక శక్తిని మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్(Anti oxidants) రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు రక్తహీనత (Anemia) ను కూడా తగ్గిస్తుంది.
అత్తిపండ్లు:
అంగస్తంభన సమస్యలను తగ్గించడంలో అత్తి పండ్లు (Fig) చాలా బాగా సహాయపడతాయి. పునరుత్పత్తి వ్యవస్థ యొక్క ఆరోగ్యం మరియు సంతాన ఉత్పత్తిని మెరుగుపరచడంలో అత్తిపండ్లు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి.
అవకాడో:
విటమిన్ -E,మెగ్నీషియం (Magnesium), బీటా కెరోటిన్ (Beta Carotene) వంటి పోషకాలు అవకాడో లో మెండుగా ఉన్నాయి. అవకాడో ను కామోద్ధీపన పండు అని పిలవబడుతుంది మరియు ప్రసిద్ధి చెందింది. పురుషుల్లో శృంగార శక్తి, సామర్థ్యాలను పెంచేలా చేయడంలో అవకాడో (Avocado) చాలా బాగా పనిచేస్తుంది.
స్ట్రాబెర్రీలు:
లైంగిక శక్తి, సామర్థ్యాలను పెంచే వాటిల్లో స్ట్రాబెర్రీ (Strawberry) కూడా ఒకటి. ఈ పండ్లు తినడం వల్ల సంతానోత్పత్తి( Fertility) మరియు శృంగార సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా దోహదపడుతుంది. దీనిలో విటమిన్- C, జింక్ (Zink), మెగ్నీషియం, పొటాషియం వంటివి సమృద్ధిగా ఉండటం వలన లైంగిక శక్తిని పెంచడం లో ఉపయోగపడతాయి.
Also Read : రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా ?
మీలో సెక్స్ కోరికలు పెంచే హార్మోన్ , సంతానాన్నికూడా కలిగిస్తుంది !
ఖర్బూజా:
ఖర్బూజా (Musk melon) లో విటమిన్-E మరియు K ఉండటం వల్ల లైంగిక శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సంతానలేమి తో బాధపడే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
బీన్స్:
మధుమేహం ఉన్నవారికి బీన్స్ (Beans) తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి ని పెంచడంలో సహాయపడతాయి. వీటిల్లో ఫైబర్ (Fiber) అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మరియు గుండె (Heart) పనితీరును కూడా మెరుగుపరచడంలో సహాయపడతాయి.
కాబట్టి మానసిక ఆందోళన, ఒత్తిడి మరియు సంతానలేమి తో బాధపడేవారు రోజు వారి ఆహారంలో ఇటువంటి పండ్లు మరియు కూరగాయలను చేర్చుకోవడం వల్ల ఈ సమస్యల నుండి బయట పడే అవకాశం ఉంది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…