మీలో సెక్స్ కోరికలు పెంచే హార్మోన్ , సంతానాన్నికూడా కలిగిస్తుంది !

కొంతమంది స్త్రీ,పురుషులలో సెక్స్ కోరికలు తక్కువగా ఉంటాయి. కొన్ని అధ్యయనాలలో కిస్ పెప్టిన్ అనే హార్మోన్ సెక్స్ కోరికలను పెంచుతుందని అభిప్రాయం వ్యక్తమైనది . దీనిని వాడిన వారికి సంతానం కలిగినట్లుగా పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన రెండు పరిశోధనలలో సెక్స్ కోరికలు అరకొర ఉన్న పురుషులు మహిళలకు కిస్ పెప్టిన్ హార్మోన్ (Harmon ) ను ఇవ్వడం వలన మెదడులో సెక్స్ కోరికలు కలిగించే స్థానం యాక్టివ్ గా మారుతున్నట్లు వెల్లడైంది.

బ్రిటన్ పరిశోధకులు చెబుతున్న ప్రకారం దగ్గర దగ్గర 10 శాతం మంది జనాభాని వేధిస్తున్న సెక్స్ (Sex ) లో ఆలోచనలు  తగ్గిపోవడం అనే సమస్యను కిస్ పెప్టిన్ హార్మోన్ సమర్థవంతంగా పరిష్కరిస్తుంది అని అంటున్నారు.

ఇంపీరియల్ కాలేజీ లండన్ పరిశోధకులు తెలిపిన ప్రకారం వయసు పెరుగుతున్న వారికంటే వయసులో ఉన్నవారే తమలో సెక్స్ ఆలోచనలు (Sex Thoughts) తగ్గిపోతున్నాయని అత్యధిక మంది చెపుతారని పేర్కొన్నారు.

అయితే, చాలా మంది ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ కొంతమందిని మాత్రం ఈ విషయం మానసికంగా, సామాజికంగా కుంగదీస్తుంది కూడా.

సెక్స్ కోరికలు తక్కువగా ఉన్న సమస్యతో బాధపడుతున్న 43 సంవత్సరాల విన్సెంట్ (పేరు మార్చడం జరిగింది) కూడా ఈ అధ్యయనాల్లోని ఒక దాంట్లో పాల్గొన్నారు.

‘‘బాగా అలసిపోయాను.. పని ఒత్తిడి అధికంగా ఉంది.. ఇప్పుడు వద్దు అనే సాకులు చెప్పి తప్పించుకునే వాణ్ని’’ అని విన్సెంట్ చెప్పారు.

‘‘నాలో సెక్స్ కోరికలు తక్కువగా ఉన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. ఎందుకంటే అసలు నాకు అమ్మాయిలంటేనే ఇష్టం ఉండదు అని వారు అనుకుని అయోమయానికి లోనవుతారు అని భయం వేసింది’’ అని ఆయన తెలిపారు.

కిస్‌పెప్టిన్ నేచురల్ గానే శరీరంలో ఉత్పత్తయ్యే హార్మోన్.

Also Read :మీ కండరాల సామర్థ్యం తోపాటు, టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరగాలంటే తీసుకోవలసిన ఆహారం

Nervous Weakness : మీ నరాల బలహీనతను నివారించండి .. దృఢత్వాన్ని పెంపొందించండి ఇలా..

Introvert children : మీ పిల్లలు సమాజంతో కలవలేకపోతున్నారా? సరియైన మార్గానికై తల్లిదండ్రుల రక్షణ తప్పనిసరి.

కిస్ పెప్టిన్ సెక్స్‌కు సంబంధించిన ఇతర హార్మోన్లు శరీరంలో విడుదల కావడంలో కీలక పాత్ర (A key Role ) పోషిస్తుంది.

గతంలో జరిపిన పలు అధ్యయనాలలో కిస్ పెప్టిన్ హార్మోన్ మహిళలలోని అండాశయం, అండాలను (Ovaries) విడుదల చేసేలా ప్రేరణ కలిగిస్తుందని అధ్యయనాల్లో తేలింది.

ఇంకోవైపు పురుషుల్లో సెక్స్ కోరికలను కూడా ఇది అధికం అవడానికి తోడ్పడగలదని వెల్లడైంది.

అయితే, సెక్స్ కోరికలు తక్కువగా ఉన్నవారిలో ఇది ఎలా పనిచేస్తుందో పరీక్షించడం ఇదే మొదటిసారి.

అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ అలెగ్జాండర్ కామ్నినోస్ ప్రకారం “సెక్స్ కోరికలు తక్కువగా ఉన్న వారు సెక్స్‌లో పాల్గొనడం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. దీని ఫలితంగా వారు ఆత్మన్యూనతకు లోనవుతారు. దానివలన వారి జననాంగాల్లో (The genitals ) ఉద్రేకం కనిపించదు’’ అని పేర్కొన్నారు.

‘‘ఈ హెచ్చు తగ్గులకు కిస్‌పెప్టిన్ పరిష్కారం చూపించగలదు’’ అని ఆయన చెప్పారు.

పురుషుల జననాంగానికి రక్త సరఫరా ప్రక్రియను వయాగ్రా కంటే కిస్ పెప్టిన్ హార్మోన్ మెరుగుపరుస్తుంది.

దీని పనితీరును తెలుసుకునేందుకు చేసిన రెండు అధ్యయనాల్లో 21-52 సంవత్సరాల మధ్య వయసున్న 32 మంది పురుషులు, 18-45 ఏళ్ళ మధ్య వయసున్న 32 మంది మహిళలు పాల్గొన్నారు. వీరంతా హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్ సమస్య తో బాధపడుతున్నారు.

The hormone that increases sex desire in you, also causes children!
image credit : Scholar Science Journals

పరిశోధనలలో పాల్గొన్న వారందరికీ కొన్నిసార్లు కిస్‌పెప్టిన్, మరికొన్ని సార్లు ప్లాసిబో ఇచ్చారు. ఆ సమయంలో ఎంఆర్ఐ స్కాన్‌ల సాయంతో వారి ప్రవర్తన అదే సమయంలో వారి మెదడు (Brain ) లోని భాగాల పనితీరును పరిశీలించారు. పురుషులలో వారి జననాంగాల కదలికలను సైతం పరిశీలించారు.

నాకు అబ్బాయి పుట్టాడు’

స్కానర్‌లో ఉండేటప్పుడు తన జననాంగాన్ని స్కానర్ (Scanner ) లో ఉన్నప్పుడు పరిశీలించినప్పుడు కొంచెం వింతగా ఉన్నదని కానీ, ఈ పరిశోధనలో పాల్గొనడంతో ఎంతో మేలు జరిగిందని విన్సెంట్ చెప్పారు.

‘‘ఇప్పుడు నాకు పిల్లాడు పుట్టాడు. నేను ఆ హార్మోన్‌ను వాడిన తరువాతే నాకు బాబు పుట్టాడు ’’ అని అతను పేర్కొన్నాడు.

అయితే, ఇలా జరగడానికి హార్మోన్ కారణమా, కాదా అనే విషయాన్ని నిరూపించడం కష్టమని, కానీ, గతం కంటే నాలో కోరికలు పెరిగాయని ఆయన చెప్పాడు.

అసలు సెక్స్ కోరికలు లేని వారిలోనూ ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగుపడింది. ప్లాసిబోతో పోల్చుకుంటే కిస్‌పెప్టిన్‌        (KissPeptin) తీసుకున్న పురుషుల్లో జననాంగం 56 శాతం (56Percent ) వరకూ గట్టిపడడం పెరిగింది.

‘‘చాలా కేసుల్లో దీనివలన అనుకూల ప్రభావం కనిపిస్తుంది. నిజానికి మేం ల్యాబ్‌లో మెదడు (Brain) భాగాలను పరిశీలించాం. అదే బెడ్‌రూమ్‌లోనో లేదా ఇంట్లో మరెక్కడైనా అయితే పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండొచ్చు’’ అని కామ్మినోస్ తెలిపారు.

కిస్‌పెప్టిన్ హార్మోన్ తీసుకున్న తరువాత తమని తాము మరింత సెక్సీగా చూసుకుంటున్నామని మహిళలు పేర్కొనగా, సెక్స్‌ సమయంలో తమ సంతోష స్థాయిలు అధికమయ్యాయని పురుషులు తెలిపారు.

పురుషులు మరియు మహిళల పైన జరిగిన ఈ అధ్యయనాలను జేఏఎంఏ నెట్ వర్క్ (JAMA Net Work)ఓపెన్ జర్నల్‌లో ప్రచురించారు.

రిలేషన్‌షిప్ సమస్యలు, ఒత్తిడి, అంగ స్తంభనం, యోని పొడిబారడం, మెనోపాజ్, ప్రసవం తర్వాత అలసట ఇలా చాలా అంశాల వల్ల సెక్స్ కోరికలు తగ్గపోతాయని ఎన్‌హెచ్ఎస్ వెబ్‌సైట్‌ (NHS Web Site) లో పేర్కొన్నారు.

అతిగా ఆల్కహాల్ సేవించినా, గర్భనిరోధకాలు వాడినా, కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్లు వలన కూడా సెక్స్ కోరికలు తక్కువగా ఉంటాయి.

గుండెజబ్బులు, మధుమేహం, థైరాయిడ్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా కొన్నిసార్లు సెక్స్ కోరికలను తగ్గేలా చేస్తాయి.

Leave A Reply

Your email address will not be published.