TVS IQube : లక్ష రూపాయల స్కూటర్ కేవలం రూ. 41000 మాత్రమే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 145 km మైలేజ్..

TVS కంపెనీ మార్చి నెలలో iCube ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా  41,000 వరకు తగ్గింపు అందిస్తుంది.

Telugu Mirror : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు శుభవార్త. ప్రముఖ ఇ-స్కూటర్ తయారీదారు TVS తన విలక్షణమైన iCube ఎలక్ట్రిక్ స్కూటర్ పై మంచి ఆఫర్లను అందిస్తోంది. TVS కంపెనీ మార్చి నెలలో iCube ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా  41,000 వరకు తగ్గింపు అందిస్తుంది. అయితే ఆ ఆఫర్ లు ఎలా ఉన్నాయి మరియు ఈ స్కూటర్ యొక్కస్పెసిఫికేషన్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం.

ఏప్రిల్ 1, 2024 నాటికి, FAME 2 సబ్సిడీ నిలిపివేయబడుతుంది.  ఈ తరుణంలో  కంపెనీలు తమ స్టాక్‌లను క్లియర్ చేయాలనుకుంటున్నాయి. TVS Icube రూ.22,065 వరకు సబ్సిడీలను అందుకుంటుంది. నో కాస్ట్ EMIపై కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ. 7500 వరకు తగ్గింపుతో పాటు  అదనంగా రూ. 6000 వరకు క్యాష్ బ్యాక్ కూడా వర్తిస్తుంది. అలాగే  రూ. 5000 విలువైన ఉచిత ఎక్స్‌టెండెడ్‌ వారంటీ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ మార్చి 31, 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అని టీవీఎస్ (TVS) కంపెనీ తెలిపింది.

Also Read : Infinix Note 40 And 40 Pro : చీతా X1 ఛార్జింగ్ చిప్ తో విడుదలకు సిద్దం అవుతున్న Infinix Note 40 సిరీస్‌.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై అన్ని తగ్గింపులు పోగా ఈ అద్భుతమైన స్కూటర్  కేవలం రూ. 40,564 ధరకే లభించనుంది. ఈ ఇ-స్కూటర్‌ని కొనుగోలు చేయాలి అనుకునేవారికి  ఇదే మంచి సమయం. మార్చి 31 వరకు పరిమిత కాల ఆఫర్ ఉంది ఆ తర్వాత  ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరగనున్నాయి. TVS Icube దేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ గ నిలిచింది.

145 mileage is enough on one charge.. Super electric scooter from TVS.. These are the features..

మిగతా వాటితో పోలిస్తే దీనికి ప్రధాన ఆకర్షణ అతి పెద్ద టచ్ స్క్రీన్ (Touch screen) ప్యానెల్. ఇది మన స్కూటీలో ఛార్జింగ్ ఎంత ఉంది, ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్లగలదు మరియు అనేక ఫీచర్స్ అన్ని డిజిటల్‌గా అక్కడ స్క్రీన్‌పైనే కనిపిస్తుంటుంది. స్కూటర్ ని డ్రైవ్ చేసే వ్యక్తుల హైట్‌కు తగ్గట్లుగా సీట్‌ను రీ అరెంజ్ చేసుకునే వెసులుబాటు కూడా దీనిలో ఉంటుంది. ఇంకా రియల్ వ్యూ మిర్రర్, లైవ్ వెహికిల్ ట్రాకింగ్, జియో ఫేసింగ్ అలర్ట్, అలర్ట్ అండ్ నావిగేషన్ సిస్టమ్ వంటి సదుపాయాలు అన్నీ ఇందులో ఉన్నాయి.

Also Read : TS TET 2024 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. డీఎస్సీ దరఖాస్తు గడువు పెంపు..

టీవీఎస్ ఐక్యూబ్ ఫీచర్లు :

టీవీఎస్ iCube ఎలక్ట్రిక్ స్కూటర్ 5.1-kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది 140 కి.మీ.స్పీడ్ రేంజ్ ను అందిస్తుంది. స్కూటర్‌లో 5-వే జాయ్లాస్టిక్ ఇంటరాక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్స్, వెహికల్ హెల్త్ గురించి ప్రోయాక్టివ్ నోటిఫికేషన్‌లు, 4G టెలిమాటిక్స్ మరియు OTA అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. స్కూటర్ థీమ్‌లో అలెక్సా వాయిస్ అసిస్టెన్స్ ఉంటుంది. ఇది 1.5 kW వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనిలో స్మార్ట్ కనెక్ట్ ప్లాట్‌ఫారమ్‌లో అప్‌గ్రేడ్ చేసిన నావిగేషన్ సిస్టమ్, టెలిమాటిక్స్ యూనిట్, యాంటీ-థెఫ్ట్ టెక్నాలజీ మరియు జియోఫెన్సింగ్ ఉన్నాయి.

Comments are closed.