Poco x6 neo : పోకో నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. తక్కువ బడ్జెట్‌లోనే అద్భుతమైన ఫీచర్స్‌..

POCO సంస్థ తన X6 నియో స్మార్ట్‌ఫోన్ ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎక్స్6 నియో ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ ద్వారా మార్కెట్‌లో ఈ నెల 13 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించనున్నది.

Telugu Mirror : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ సబ్ బ్రాండ్ పోకో (Poco) తన పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్ ని  భారత్ మార్కెట్‌లో ఈ నెల 13 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించనున్నది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ వెల్లడించిన సమాచారం ప్రకారం పోకో ఎక్స్6 నియో ఫోన్ బ్లూ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. రెక్ట్యాంగులర్ రేర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో రెండు కెమెరా సెన్సర్లు వస్తాయి.

Also Read : Mahila Samman Savings Scheme 2024: మహిళలకు మాత్రమే స్పెషల్ స్కీమ్, తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ మీ సొంతం

పోకో కంపెనీ ఇండియా X (గతంలో Twitter)లో పోస్ట్ ద్వారా Poco X6 Neo భారతదేశంలో మార్చి 13న మధ్యాహ్నం 12 గంటలకు IST అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ఫోన్ ప్రముఖ ఇ కామర్స్ వెబ్‌సైట్‌ అయినా ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుందని పోకో తెలిపింది. Poco X6 Neo యొక్క వెనుక కెమెరా మాడ్యూల్‌లో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్‌ని కలిగి ఉంటుంది మరియు 93.3 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో మంచి డిజైన్ ని కలిగి ఉంది. పోకో ఎక్స్6 నియో దాదాపుగా సైడ్ బెజెల్స్ లేకుండా ఫ్లాట్ సెంటర్డ్ హోల్-పంచ్ డిస్‌ప్లేతో వస్తుంది.

అదే సమయంలో Poco X6 నియో నారింజ కలర్‌తో ట్వీట్ చేసింది. ఫోన్ మరో రెండు కలర్స్‌లో అందుబాటులో లభించనుంది. Poco X6 Neo మోడల్ 8GB RAM రెండు స్టోరేజ్ ఆప్షన్‌లతో లాంచ్ అవుతుందని POCO India వెల్లడించింది. దీని ధర కూడా రూ. 18,000గా నిర్ధారించింది. ఫోన్ OLED డిస్‌ప్లే, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో రానుంది.

Also Read : HanuMan OTT : షాక్ ఇచ్చిన హనుమాన్ టీమ్.. ఓటీటీ కన్నా ముందే టీవీలో ప్రసారం.

ఇక రెడ్‌మీ నోట్‌ 13ఆర్‌ ప్రోకి రీబ్రాండ్‌గా రానున్నట్లు తెలుస్తోన్న ఈ ఫోన్‌లో అచ్చం రెడ్‌మీ నోట్‌ 13ఆర్‌ ప్రో ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. రెడ్‌మీ మోడల్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం ఇందులో 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ధర విషయానికొస్తే రెడ్‌మీన నోట్ 13 ప్రో ఆర్‌ ఫోన్‌ను రూ. 23,000గా నిర్ణయించారు.

Comments are closed.